ఢిల్లీ సీఎం పీఠం మళ్లీ కేజ్రీవాల్‌దేనని సర్వేలు వెల్లడిస్తున్న వేళ.. సర్వేలోనూ అదే విషయం వెల్లడైంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 54-60 స్థానాల్లో గెలుస్తుందని, బీజేపీ 10-14 సీట్లను సొంతం చేసుకుంటుందని టైమ్స్ నౌ అంచనా వేసింది. కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే.. 2019 తరహాలోనే ఢిల్లీలో ఏడు స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ఈ సర్వేలో తేలడం విశేషం. Ipsos నిర్వహించిన ఈ పోల్‌లో ఆప్‌కు 52 శాతం ఓట్లు వస్తాయని, బీజేపీకి 34 శాతం ఓట్లు వచ్చాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ 2.5 శాతం ఓట్లను కోల్పుతుండగా.. బీజేపీ 1.7 శాతం ఓట్లను పెంచుకుంటోంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే మాత్రం బీజేపీకి ఓటేస్తామని 46 శాతం మంది, ఆమ్ ఆద్మీ పార్టీకి వేస్తామని 38 శాతం మంది చెప్పడం గమనార్హం. ప్రధానిగా మోదీకే ఎక్కువ మంది ఢిల్లీవాసులు మొగ్గు చూపుతున్నారు. IPSOS జనవరి 27, ఫిబ్రవరి 1 తేదీల మధ్య ఢిల్లీ వ్యాప్తంగా ర్యాండమ్‌గా 7,321 అభిప్రాయాలను సేకరించింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2vOVPkh
No comments:
Post a Comment