Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 4 February 2020

కరోనా కేంద్ర స్థానం.. వుహాన్‌‌లో ఇంత మంది భారత విద్యార్థులు ఎందుకు?

కరోనా వైరస్ సహా ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఈ వైరస్ కేంద్ర స్థానమైన వుహాన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ 425 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 వేల మందికిపైగా చికిత్స పొందుతున్నారు. చైనా నుంచి తిరిగొచ్చిన కేరళ మెడికల్ స్టూడెంట్లకు కరోనా సోకిందని తేలింది. ఏపీకి చెందిన మెడికల్ విద్యార్థులను కూడా పరీక్షించారు. కానీ వారు ముందే సొంతూళ్లకు వచ్చేయడంతో వారికి వైరస్ సోకలేదు. వుహాన్‌లో ఉంటున్న భారతీయుల్లో చాలా మంది వైద్య విద్యార్థులే ఉండటం గమనార్హం. గత కొంత కాలం క్రితం వరకు పేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇది 1.1 కోట్ల మంది జనాభాతో చైనాలో ఏడో అతిపెద్ద నగరంగా అవతరించింది. ఆర్థిక, వాణిజ్య, విద్యాకేంద్రంగా మారింది. ఇటీవలే ఇంగ్లిష్‌లో ఎంబీబీఎస్ కోర్సును వుహాన్‌లో ప్రారంభించారు. దీంతో అక్కడ మెడిసిన్ చదివేందుకు భారత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వుహాన్ యూనివర్సిటీలో 2500 మంది స్టాఫ్ ఉండగా.. 5100 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 600 మంది విదేశీ విద్యార్థులున్నారు. వుహాన్, పరిసర ప్రాంతాల్లో 700 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటుండగా.. వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే. భారత్‌లో ఎంబీబీఎస్ సీటు పొందడం కష్టంతో కూడుకున్న పని, ఖర్చు కూడా ఎక్కువే. దీంతో మెడిసిన్ చదవాలని భావించే వారు తక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో చైనా లాంటి దేశాల వైపు చూస్తున్నారని కరన్ గుప్తా అనే ఎడ్యుకేషన్ కౌన్సెలర్ తెలిపారు. ‘ఏడాదికి ఏడు వేల డాలర్లు ఖర్చు పెడితే చాలు అత్యాధునిక వసతులు, ల్యాబోరేటరీలు, అద్భుతమైన ఫ్యాకల్టీ సాయాంతో మీరు మెడిసిన్ పూర్తి చేయొచ్చు. భారత్‌లోని కాలేజీల్లో అందరికీ ఈ స్థాయి సదుపాయాలు అందుబాటులో లేవు’ అని చైనా ప్రచారం చేసుకుంటోంది. స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తూ విద్యార్థులను ఆకర్షిస్తోంది. చైనాలో 45 కాలేజీలు ఇంగ్లిష్ మీడియంలో మెడిసిన్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. మరో 200 కాలేజీల్లో ఇంగ్లిష్‌తోపాటు చైనీస్ భాషల్లో బోధిస్తున్నారు. 2015లో 13500 మంది భారతీయ విద్యార్థులు చైనాలో చదువుకున్నారు. చైనా వర్సిటీలకు విద్యార్థులను పంపుతున్న టాప్-10 దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. 2019 డేటా ప్రకారం చైనాలో 23 వేల మంది భారతీయ విద్యార్థులు ఉండగా.. వీరిలో 21 వేల మంది చైనీస్ మెడికల్ స్కూళ్లలో చదువుతున్నారు. రష్యాలోని 58 విద్యాసంస్థల్లో వైద్య విద్య అభ్యసించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఇక్కడ 6 వేల మందికిపైగా భారతీయులు ఎంబీబీఎస్ చదువుతున్నారు. విదేశాల్లో మెడిసిన్ చదివిన వారు భారత్ తిరిగొచ్చాక ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) రాయాల్సి ఉంటుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దగ్గరున్న సమాచారం ప్రకారం రష్యా, చైనాల్లోని మెడికల్ కాలేజీల్లో చదువుకున్న వారిలో 2015-18 మధ్య 12.91 శాతం, 11.67 శాతం చొప్పున ఎఫ్ఎంజీఈ ఉత్తీర్ణులయ్యారు. వాస్తవానికి చైనా విద్యార్థులు బయటి దేశాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో చైనీయులే ఎక్కువ. అంతే కాదు అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తోన్న మూడో దేశంగా చైనా అవతరించింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఐదో గమ్యస్థానంగా చైనా మారింది. ‘భారత విద్యార్థులను ఆకర్షించడం కోసం చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇంగ్లిష్‌లో బోధనను ప్రారంభించడంతోపాటు ఆ దేశ విద్యాసంస్థలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంది’ అని కౌన్సెలర్ ప్రతిభా జైన్ తెలిపారు. చైనాలో మెడిసిన్ చదివిన విద్యార్థులు తిరిగి భారత్ వచ్చాక ఎఫ్ఎంజీఈ పాస్ కావడానికి, డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందే అవకాశాలు ఎక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/36YQt2y

No comments:

Post a Comment