
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై సోషల్‌మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు చేస్తున్న వ్యక్తిపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి ఇటీవల టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ను దుర్భాషలాడుతూ కొన్ని వీడియోలు తీసి పోస్ట్ చేశాడు. Also Read: ఆ వీడియోలను చూసిన దువ్వూరు మండలం పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నాయకుడు కానాల జయచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలా వీడియోలు చేస్తున్న పుల్లయ్యపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ కుళ్లాయప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: గత వారం డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణిపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో కామెంట్ చేసిన యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఓ యువకుడు తనపై అసభ్యకరంగా కామెంట్ చేశారని పుష్పశ్రీవాణి గతేడాది అక్టోబర్‌లో చినమేరంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న అతడిని అరెస్ట్ చేసి పార్వతీపురం తీసుకొచ్చారు. గత కొద్దిరోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలపై అసభ్యకరమైన కామెంట్స్, పోస్ట్ పెడుతున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎంపై అసభ్యకర వీడియోలు చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3a8oz6f
No comments:
Post a Comment