Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 26 February 2020

TDP: బాబుకు షాకిచ్చిన విశాఖ పోలీసులు.. వైసీపీ నిర్ణయంతో నగరంలో టెన్షన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జగన్ సర్కారు షాకిచ్చింది. గురువారం విశాఖపట్నంలో నిర్వహించనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్య యాత్రను చేపట్టనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన గురువారం ఉదయం 9 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయనగరం జిల్లాకు బయల్దేరి వెళ్తారు. దార్లో పెందుర్తి మండలంలో భూసమీకరణ బాధితులతో ఆయన మాట్లాడాలని భావించారు. ఈ సందర్భంగా బాబుకు స్వాగతం పలకడం కోసం టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించాలని భావించాయి. ఇందుకోసం రెండు రోజులుగా పోలీసుల అనుమతి కోసం ప్రయత్నించారు. కానీ రెండ్రోజులపాటు తిప్పించుకున్న పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు వెంట 50 మందికి మించి నాయకులు ఉండకూడదనే నిబంధన విధించారు. ఎక్కువ సంఖ్యలో వాహనాలను వినియోగించొద్దని కూడా సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. పోలీసుల తీరు పట్ల విశాఖ టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. పార్టీ అధినేతకు ఘన స్వాగతం పలకడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఇలా వ్యవహరిస్తున్నారని.. తాము గతంలో ఇలాగే వ్యవహరించి ఉంటే జగన్ 3 వేల కి.మీ. పాదయాత్ర చేపట్టే వారా? అని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొంటామని, పోలీసులు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన తర్వాత చంద్రబాబు తొలిసారి విశాఖ వెళ్తుండటంతో.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబును విమానాశ్రయం దగ్గరే అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రను అవహేళన చేసేలా మాట్లాడిన చంద్రబాబును అడ్డుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అటు పోలీసుల ఆంక్షలు, ఇటు వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుంటామని చెప్పిన తరుణంలో బాబు విశాఖ టూర్ ఆసక్తికరంగా మారింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2T3fqX2

No comments:

Post a Comment