
కృష్ణా జిల్లా నూజివీడులో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రిపుల్ ఐటీ సమీపంలోని రాత్రివేళ తండ్రి కోసం ఎదురుచూస్తున్న మైనర్ బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ట్రిపుల్ ఐటీ సమీపంలో వదిలేసి పారిపోయాడు. Also Read: నూజివీడుకు చెందిన వ్యక్తికి ఓ కుమార్తె ఉంది. మంగళవారం సాయంత్రం ఓ పని నిమిత్తం బయటకు వెళ్లిన అతడు రాత్రయినా ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారుపడిన బాలిక తండ్రి కోసం రాత్రివేళ్ల రోడ్డుపైకి వెళ్లి ఎదురు చూడసాగింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి బాలికను గమనించి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి ఎత్తుకెళ్లాడు. ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడి ట్రిపుల్ ఐటీ సమీపంలో వదిలేసి పరారయ్యాడు. Also Read: రక్తస్రావంతో బాధపడుతున్న బాలిక ఏడుస్తూ పెట్రోల్ పోలీసుల కంట పడింది. దీంతో వారు ఏం జరిగిందని బాలికను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న నూజివీడు పోలీసులు నిందితుడి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3cdSrQI
No comments:
Post a Comment