⍟ దేశంలో కేసులు 258కి చేరుకున్నాయి. వీరిలో 39 మంది విదేశీయులు కూడా ఉన్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 11,420 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గతంలో ఆఫ్రికా దేశాల్లో వెలుగుచూసిన ఎబోలా వైరస్ మరణాలను కరోనా మృతులను దాటేసింది. ⍟ కరోనా వైరస్ విషయంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. ట్రంప్ ఇటీవలే కోవిడ్- 19ను చైనా వైరస్‌గా అభివర్ణించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చైనానే కారణమని ఆయన దుయ్యబట్టారు. వైరస్ గురించి సమాచారాన్ని చైనా దాచిపెట్టడంవల్లే ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ మండిపడ్డారు. ⍟ దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుండంతో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ 19ను సమర్ధవంతంగా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్టు చేయాలని ఆదేశించింది. అవసరమైన పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని అన్ని ప్రయివేట్, ప్రభుత్వ హాస్పిటల్స్, వైద్య విద్యా సంస్థలకు మార్గదర్శకాలు జారీచేసింది ⍟ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక సతమతవుతున్నాయి. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 11,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 2.76 లక్షలు దాటింది. ⍟ దేశంలో కరోనా వైరస్ మరో స్థాయికి ప్రవేశించిందని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. వైరస్ నియంత్రణలో భాగంగా ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూను విజయవంతం చేసి, మహమ్మారిపై పోరాటానికి సహకరించాలని కోరింది. కాగా, ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 249కి చేరుకుంది. గడచిన మూడు రోజుల్లో దేశంలో కొత్తగా 110కిపైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి . ⍟ హాట్ అండ్ సెక్సీ హీరోయిన్ దిశ పటాని. నిత్యం హాట్ హాట్ ఫోటోలతో తన అభిమానులకు కనువిందు చేస్తుంటుది. తాజాగా ఈ కుర్ర హీరోయిన్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అనేక మంది సినీ నటులు స్వియ గృహ నిర్బంధంలో ఉంటున్నారు. ⍟ ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా జరపాలని నిర్ణయించుకున్న జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎవరికివారు విధిగా ఇంట్లోనే ఉండిపోవాలని సూచించారు ⍟ తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 19కి చేరింది. శుక్రవారం (మార్చి 20) కొత్తగా మరో 3 కేసులు నమోదైనట్లు తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఈ ముగ్గురు బాధితులు కూడా విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2wsTIDf
0 Comments