ప్రేమ పేరుతో సమీప బంధువే తీవ్రంగా వేధించడంతో తట్టుకోలేకపోయిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలోని జిల్లా నర్సాపూర్ మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన యువతి(17) నర్సాపూర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఇటీవలే పరీక్షలు రాసి ఇంటి వద్దే ఉంటోంది. సమీప బంధువైన ఓ యువకుడు(20) ప్రేమించాలంటూ ఆమెను తీవ్రంగా వేధిస్తున్నాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరి బెదిరింపులకు గురిచేస్తున్నాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని హెచ్చరించేవాడు. Also Read: గురువారం రాత్రి కూడా ఆ యువకుడి మరోసారి తీవ్రంగా వేధించడంతో తట్టుకోలేకపోయిన యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అయితే బంధువుల కుర్రాడు కావడంతో జాగ్రత్తగా సమస్యను పరిష్కరించాలని, శుక్రవారం మాట్లాడతామని వారు చెప్పారు. ఉదయం తండ్రి గొర్రెల మేపడానికి వెళ్లగా, తల్లి ఇంటి పనుల నిమిత్తం వెనుక వైపునకు వెళ్లింది. అయితే తన విషయంలో తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన యువతి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. Also Read: ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన తల్లి లోపలికి వెళ్లి చూసేసరికే కుమార్తె కాలిపోతోంది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రేమ వేధింపులే తమ కూతురి ప్రాణం తీశాయని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/399P76q
0 Comments