
కర్ణాటక హైకోర్టులో ఉద్యోగం పేరుతో రూ.లక్షలు పోగొట్టుకున్న యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా గూడూరు మండలం జూలకల్ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, కామేశ్వరమ్మ దంపతుల కుమారుడు రాఘవేంద్రరెడ్డి (29) ఎంబీఏ చదివి హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడ వైశ్యారాం, దీపక్, శేషాద్రి, సురేష్‌గౌడ్ అనే వ్యక్తులు అతడికి పరిచయమయ్యారు. Also Read: కర్ణాటక హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని వారు చెప్పడంతో రాఘవేంద్రరెడ్డితో పాటు ఆయన చిన్నాన్న కుమారుడు బి.మహేంద్రరెడ్డి, అదే గ్రామానికి చెందిన నాగరాజు, మిన్నెల్లాతో కలిసి మొత్తం రూ.25 లక్షలు ఇచ్చారు. వారు మొదట మహేంద్రరెడ్డికి అటెండర్ ఉద్యోగం వచ్చినట్లు గతేడాది జులై 10న బోగస్ నియామక ఉత్తర్వులను పంపారు. కోర్టుకు తీసుకెళ్లి ఉద్యోగం చేస్తున్నట్లు 20 రోజులు నాటకం ఆడించి ఆ తర్వాత ఉద్యోగం లేదని ఇంటికి పంపేశారు. Also Read: మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఈ నెల 1న హైదరాబాద్‌కు వెళ్లి తమ డబ్బులను వెనక్కి ఇవ్వాలని ఆ నలుగురిని కోరారు. వారు డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన రాఘవేంద్రరెడ్డి ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబీకులు వెంటనే పెంచికలపాడు విశ్వభారతి ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3foBovp
No comments:
Post a Comment