
గ్రామంలో ప్రజలకు సేవలు అందించాల్సిన వాలంటీర్ కామాంధుడిగా మారాడు. పెళ్లయి ఓ బిడ్డ ఉన్న మహిళకు ప్రేమ లేఖలు రాస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమె అన్నా అని పిలుస్తున్నా వావివరుసలు మరిచి తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. ఈ ఘటన జిల్లా నార్పల మండలంలో వెలుగుచూసింది. ఉయ్యాలకుంట గ్రామంలో సుబ్రమణ్యం అనే యువకుడు వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామానికి చెందిన ఓ వివాహితను కొంతకాలంగా వేధిస్తున్నాడు. Also Read: సోమవారం ఆమె ఇంటికి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు వెళ్లిన అతడు ‘ఐ లవ్ యూ’ అంటూ రాసిన పేపర్‌ను చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. ఆ పేపర్‌ను చూసి షాకైన మహిళ ఈ విషయాన్ని భర్తకు తెలియజేసింది. దీంతో అతడు తన బంధువులు, స్థానికులతో కలిసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాడు. తన భార్యపై వేధింపులకు పాల్పడుతున్న గ్రామ వాలంటీర్ సుబ్రమణ్యాన్ని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలంటూ బాధితురాలి భర్త డిమాండ్ చేస్తున్నాడు. మహిళలను వేధించేందుకేనా ప్రభుత్వం వాలంటీర్లను నియమించేది అంటూ ఆందోళనకారులు అధికారులను నిలదీశారు. Also Read: ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్‌ను సుబ్రమణ్యాన్ని తాను అన్న అని పిలుస్తుంటానని, కానీ అతడు ఇలా చేస్తాడని ఊహించలేదని చెబుతోంది. గతంలో ఓ సారి కాగితంపై ఇంగ్లీషులో ఏదో రాసిచ్చి చదువుకోమన్నాడని తెలిపింది. అయితే తనకు ఇంగ్లీష్ చదవడం రాదని చెప్పడంతో సోమవారం తెలుగులో ‘ఐ లవ్ యూ’ అని రాసిచ్చాడని తెలిపింది. వాలంటీర్ నిర్వాకంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31ks07n
No comments:
Post a Comment