
కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో తనయుడిని నరికి చంపాడో కసాయి తండ్రి. గొడ్డలితో నరకడంతో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మండలం ఉప్పలకలవగుంటలో జరిగింది. గ్రామానికి చెందిన భూపతి వెంకటేశ్వరరావు మద్యం తాగి ఇంటికొచ్చి కొడుకు ఏడుకొండలుతో గొడవకు దిగారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి దారుణానికి తెగబడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోతూ గొడ్డలి తీసుకుని కొడుకుని నరికేశాడు. ఈ దాడిలో కొడుకు ఏడుకొండలుకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3jIc0Tv
No comments:
Post a Comment