
హ్యాపీగా సాగిపోతున్న జీవితంలో ఊహించని కష్టమొచ్చింది. కంటికి రెప్పల్లా కాపాడుతున్న తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకు చికిత్స చేయించేందుకు మరో ఊరు వెళ్లి మరీ అక్కడే ఉంటున్నారు. కానీ జబ్బును జయించలేక ఆ తండ్రి కన్నుమూయడంతో తల్లీకూతుళ్లు కుంగిపోయారు. అమితంగా ప్రేమించే తండ్రి ఇకలేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక తాము కూడా ఆయన వద్దకే వెళ్లాలని నిర్ణయించుకుని అఘాయిత్యం చేసుకున్నారు. ఈ అత్యంత విషాద ఘటన తమిళనాడులో జరిగింది. తిరుచ్చికి చెందిన అరుణ్‌పాండియన్ ఓ కాంట్రాక్టర్. ఆయనకు భార్య వలర్మతి(38), కూతుళ్లు అఖిల(19), ప్రీతి(17) ఉన్నారు. కొద్దికాలం కిందట అరుణ్‌పాండియన్ అనారోగ్యానికి గురయ్యారు. మదురైలో చికిత్స తీసుకోవాల్సి రావడంతో అక్కడే ఉంటున్న భార్య సోదరి సరస్వతి ఇంట్లో ఉంటున్నారు. కొద్దినెలలుగా చికిత్స తీసుకున్నా పరిస్థితి విషమించి ఈ ఏడాది జూలైలో తండ్రి మరణించాడు. ఇంటి పెద్ద మరణం తల్లీకూతుళ్లను తీవ్రంగా కలచివేసింది. తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన కూతుళ్లు తల్లితో కలసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటి పై అంతస్తులో ఉంటున్న తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటి రోజు ఎంతసేపటికీ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో సరస్వతి భర్త అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడడంతో ముగ్గురు విగతజీవులుగా వేలాడుతూ కనిపించారు. తాము పెంచుకుంటున్న కుక్కును కూడా తమతోనే తీసుకెళ్లారు. Read Also: అయితే తాము ఎందుకు చనిపోతున్నామో తల్లీకూతుళ్లు లేఖ రాసి పెట్టి మరీ ప్రాణాలు తీసుకున్నారు. లేఖను తమ ఫ్యామిలీ ఫొటో వద్ద పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక తాము కూడా ఆయన వద్దకే వెళ్తున్నామంటూ కూతుళ్లు సూసైడ్ లెటర్ రాయడం కంటతడి పెట్టించింది. తమ ఆస్తులను తల్లి లక్ష్మికి అప్పగించాలని.. తమ కుక్కను కూడా తమతోనే ఖననం చేయాలని రాసిపెట్టి ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదం నింపింది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37gp3Y8
No comments:
Post a Comment