Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 16 November 2020

మన్మోహన్ ఓ అసాధారణ విజ్ఞానవేత్త.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసలు

అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు, రాజకీయ అనుభవాలను ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ప్రపంచంలోని పలు దేశాల నేతల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి కూడా ఒబామా తన పుస్తకంలో ప్రస్తావించారు. మన్మోహన్ అసాధారణ విజ్ఞానం కలిగిన నిరాడంబరమైన వ్యక్తి అని కొనియాడారు. అధ్యక్షుడి హోదాలో తొలిసారి 2010లో భారత్‌ పర్యటనకు వచ్చిన ఒబామా.. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌తో పలు విషయాలపై చర్చించారు. నాటి పర్యటన సందర్భంగా మాజీ ప్రధానిలో గమనించిన అంశాలను పుస్తకంలో రాశారు. ఈ పుస్తకం నవంబర్‌ 17న విడుదల కానుండగా.. ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక ఇప్పటికే సమీక్షించింది. ‘భారత ఆర్థిక పరివర్తన ముఖ్య వాస్తుశిల్పిగా ప్రధానమంత్రి ఈ పురోగతికి తగిన చిహ్నంగా కనిపించారు.. ఓ చిన్న మతానికి చెందిన సిక్కు మైనారిటీ నేత భారత్‌లోని అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు.. స్వయం ప్రతిపత్తిగల ఈ నేత ఉన్నత జీవన ప్రమాణాలను తీసుకురావడం ద్వారా, అవినీతికి తావులేకుండా విశ్వాసాన్ని చూరగొన్నారు’ అని పేర్కొన్నారు. ‘1990లలో భారత్‌కు ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన వ్యక్తిని తనకు ఏడుపదుల వయస్సులో ఉన్నప్పుడు కలిశాను. ఆయన సున్నితంగా మాట్లాడే ఆర్థికవేత్త.. తెల్లటి గడ్డం, తలపాగాతో కనిపించారు. అతను ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో లక్షలాది మంది ఆ దేశ ప్రజలు పేదరికం నుంచి బయటపడటానికి కృషి చేశారు.. మన్మోహన్‌ తెలివైనవారు.. నిజాయతీపరుడు’ అని ఒబామా పుస్తకంలో ప్రశంసించారు. అలాగే, మాజీ ప్రధాని విదేశాంగ ఒప్పందాలకు ప్రాముఖ్యం ఇచ్చేవారని ఒబామా పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా మన్మోహన్‌సింగ్‌తో కలిసి పలు ఒప్పందాలు చేసుకున్నట్లు తన పుస్తకంలో బరాక్ ఒబామా వివరించారు. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే పిలుపును డాక్టర్ మన్మోహన్ వ్యతిరేకించడంతో ఆయన సంయమనం రాజకీయంగా నష్టం కలిగించదని ఒబామా రాశారు. ‘పెరుగుతున్న ముస్లిం వ్యతిరేక భావన భారత ప్రధాన ప్రతిపక్ష పార్టీ హిందూ విభజన జాతీయవాద బీజేపీ ప్రభావాన్ని బలపరుస్తుందని ఆయన భయపడ్డారు.. అనిశ్చిత సమయాల్లో మతపరమైన, జాతి సంఘీభావం శక్తివంతంగా ఉంటుంది. రాజకీయ నేతలు భారత్ లేదా మరెక్కడైనా దోపిడీ చేయడం అంత కష్టం కాదు అని మన్మోహన్ చెప్పినట్టు’ ఉటంకించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UxrNuz

No comments:

Post a Comment