Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 30 November 2020

కొవాగ్జిన్ ప్రయోగాల్లో వాలంటీర్‌గా మరో మంత్రి.. అన్నీ అనుకున్న జరిగితే రేపే తొలి డోసు

కోవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్‌ దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో కొనసాగుతుండగా.. పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం(62) వాలంటీర్‌‌గా పేరు నమోదుచేసుకున్నారు. కోల్‌కతాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజ్ (నైస్డ్)లో వ్యాక్సిన్ ట్రయల్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సీనియర్ అధికారి తెలిపారు. అన్ని అనుకున్నట్టు ప్రణాళిక ప్రకారం జరిగితే కోవాక్సిన్ మొదటి డోస్ తీసుకునే వాలంటీర్‌గా పశ్చిమ్ బెంగాల్ పట్టణాభివృద్ధి మంత్రి ఫిర్హాద్ హకీమ్ నిలుస్తారు. వైద్య పరీక్షలలో మంత్రి హకీమ్ ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందని నైస్డ్ సీనియర్ అధికారి తెలిపారు. కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ బుధవారం నుంచి ప్రారంభం కానుండగా.. మంత్రితో పాటు పేరు నమోదు చేసుకున్న ఇతర వాలంటీర్లను హాజరు కావాలని తాము అభ్యర్థించినట్టు నైస్డ్ అధికారులు వెల్లడించారు. మూడో దశ ట్రయల్స్‌లో ఇక్కడ కనీసం 1,000 మంది వాలంటీర్లకు కోవాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడంపై మంత్రి హకీమ్ మాట్లాడుతూ.. ‘ప్రజలకు నేను సాయం చేయాలనుకుంటున్నాను.. కోవిడ్-19కు చికిత్సలో నా సహకారం ప్రజలకు ఉపయోగపడితే చాలా సంతోషం.. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌లో పాల్గొంటున్నాను’అని తెలిపారు. మంత్రి హకీమ్ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌ బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఛైర్మన్‌గానూ ఉన్నారు. తాను పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉన్నట్టు నైస్డ్ అధికారులు వెల్లడించారన్నారు. నా కోరిక గురించి నైస్డ్ అధికారులకు చెప్పాను. నేను ప్రయోగాల్లో భాగం కావడానికి తగినవాడినా? కాదా? అని తెలుసుకోడానికి ఆరోగ్య పరీక్షలు చేశారు. నా వయసు 62 ఏళ్లు కావడంతో నా ఆరోగ్యం దీనికి అనుమతిస్తుందో లేదో వారు తనిఖీ చేశారని తెలిపారు. హకీమ్ అభ్యర్థనను స్వాగతించిన అధికారులు.. మంత్రి ధైర్యంగా ముందుకొచ్చి మరికొందరికి ప్రేరణగా నిలిచారని కొనియాడారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33t7hzN

No comments:

Post a Comment