Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 1 December 2020

వుహాన్‌ను వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలు.. బంధువులను కలవలేక నరకయాతన అనుభవిస్తూ..

మొదలై ఏడాది పూర్తయినా మహమ్మారి పురుడుపోసుకున్న వుహాన్‌లోని ప్రజలను చేదు జ్ఞాపకాలు వెంటాడతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కరోనా వైరస్‌ తన తండ్రి మరణించడంతో దీన్ని తట్టుకోలేక వుహాన్‌కు చెందిన లియు పీయెన్ అనే వ్యక్తి తన వ్యాపారాన్ని మూసివేసి బౌద్ధమతంలోకి మారాడు. అలాగే, దాదాపు 10 నెలల కిందట తన కుమారుడు కరోనాతో మరణించిన హంగ్ హన్నెంగ్ అనే మహిళ సరిగ్గా నిద్రపోవడం లేదు. తినడానికి చాలా కష్టపడుతున్నాడు.. కరోనా భయంతో స్నేహితులు, బంధువులు ఆమె కుటుంబాన్ని దూరం పెట్టారు. వుహాన్‌ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన ఏడాది గడుస్తున్నా బంధువులు ఒకరినొకరు కలుసుకోడానికి భయపడుతున్నారు. మహమ్మారి వ్యాప్తిపై వైఫల్యాలకు బాధ్యత వహించడానికి చైనా ప్రభుత్వం నిరాకరించడంతో జరిగిన నష్టం నుంచి బాధితులు కోలుకోలేకపోతున్నారు. వుహాన్ కమ్యూనిస్ట్ పార్టీ బ్యూరో మాజీ కార్యదర్శి లియు తండ్రి ఓకింగ్ (78) మహమ్మారి ముప్పు గురించి తెలియక సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన తర్వాత కోవిడ్ -19 లక్షణాలు బయటపడ్డాయి. టెస్టింగ్ కిట్‌ల కొరతతో ఆయనకు పరీక్షలు నిర్వహించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన జనవరి 29న ప్రాణాలు కోల్పోయాడు. ఆయన చనిపోయిన రోజే నేను కూడా చనిపోయానని తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా లియూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయిన లియు .. పిచ్చివాడిగా గడిపాడు. సోషల్ మీడియాలో ప్రభుత్వం వైఖరిపై ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. గతేడాది డిసెంబరు తొలినాళ్లలో కరోనా వ్యాప్తి గురించి దాచిపెట్టిన ప్రభుత్వం.. నోరు విప్పొద్దని వైద్యులపై ఒత్తిడి తెచ్చిందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. వారాల పాటు దాచిపెట్టి, కోవిడ్ ప్రపంచ మహమ్మారిగా మారడానికి దోహదపడింది. అధికారిక గణాంకాల ప్రకారం వుహాన్‌లో దాదాపు 4,000 మంది కరోనాతో చనిపోయారు. తండ్రి మరణంతో కలత చెందిన లియు బౌద్ధం స్వీకరించి, సన్యాసిగా మారిపోయాడు. విజయవంతమైన వ్యాపారవేత్త అయిన లియు.. డబ్బుకు ఇకపై అర్ధం లేదు అని అంటున్నాడు. ‘విశ్వం గురించి సత్యాన్ని’ తెలుసుకునే ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నాడు. వుహాన్‌లో లియు వంటి అనేక మంది పరిస్థితి ఇలాగే ఉంది. కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం బాధ్యతను తప్పించుకుంటూనే ఉంది.. దీనికి బదులుగా మహమ్మారి ఇతర దేశాల్లో పుట్టిందని నిరాధారమైన సిద్ధాంతాలను ప్రోత్సహిస్తోంది. వైరస్‌ విషయంలో ప్రభుత్వాన్ని దోషిగా పేర్కొంటూ కోర్టుల్లో పిటిషన్లు వేయడానికి ప్రయత్నిస్తే వాటిని తిరస్కరించాయి. న్యాయస్థానాలను ప్రభుత్వం నియంత్రిస్తోందని, తమకు న్యాయం ఎలా జరుగుతోందని వాపోతున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/39xkhsi

No comments:

Post a Comment