
భార్య కోరికలు తీర్చలేక భర్త జైలుపాలైన షాకింగ్ ఘటన వెలుగుచూసింది. డబ్బు పిచ్చిపట్టిన భార్య పక్కవారితో పోలికపెట్టి భర్తను హింసించడంతో ఆమె కోరికలు తీర్చేందుకు దొంగగా మారాడు. బైకులు దొంగతనం చేసి అమ్ముతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. భావనగర్ జిల్లా జలియాకి చెందిన బల్వంత్ చౌహాన్ సమీపంలోని ఉత్రాన్‌లో నివాసముంటూ ఓ కంపెనీలో వజ్రాలకు మెరుగుదిద్దే పని చేసేవాడు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు సంపాదించేవాడు. అయితే అతని భార్యకి సాధారణ జీవితం నచ్చలేదు. ఆడంబరాలకు పోయేది. తన అక్క భర్త బిల్డర్ కావడంతో అతనితో భర్తకి పోలిక పెట్టేది. అక్కలాంటి విలాసవంతమైన జీవితం కావాలని భర్తని గొంతెమ్మ కోర్కెలు కోరేది. ఆమె కోర్కెలు తీర్చేందుకు తన సంపాదన సరిపోక భర్త దిక్కుతోచని స్థితిలో దొంగగా మారాడు. బైకులు దొంగతనం చేసి ఆమె కోరికలు తీర్చడానికి ప్రయత్నించేవాడు. Also Read: కరోనా లాక్‌డౌన్ పుణ్యమాని అతని ఉద్యోగం కూడా పోవడంతో చోరీలు చేయడమే పనిగా మారింది. షాపింగ్ మాల్స్, ఆఫీసుల బయట ఉద్యోగులు నిలిపి ఉంచిన బైకులను చోరీ చేసేవాడు. మధ్యాహ్నం భోజన సమయం అనంతరం ఉద్యోగులు ఎక్కువ సేపు ఆఫీసులో ఉంటారని.. ఆ సమయంలోనే చోరీలకు పాల్పడేవాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి 20కిపైగా బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్య కోసం దొంగతనాలకు పాల్పడుతున్న భర్తని చూసి అవాక్కయ్యారు. Read Also:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33w6gqV
No comments:
Post a Comment