Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 7 December 2020

గోదావరి స్నానాల ఘాట్‌.. పైకి తేలిన మహిళ మృతదేహం

రోనా వైరస్ ప్రభావంతో గత 8 నెలలుగా మొక్కులు చెల్లించలేకపోయిన భక్తులు మేడారంలోని సమ్మక్క సారలక్క గద్దెలకు క్యూ కడుతున్నారు. మేడారం వెళ్లలేని భక్తులు స్థానికంగా ఆయా జిల్లాల్లో ఉన్న అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంతకుముందు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. గోదావరిఖనిలోని అలాంటి స్నానాల ఘాట్‌లో కలకలం రేగింది. అక్కడి గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం పైకి తేలడమే అందుక్కారణం. రామగుండం అయోధ్య నగర్‌కు చెందిన దుబ్బ నర్సయ్య (50) టీఎస్ జెన్కోలో ప్లాంట్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గృహిణి అయిన లక్ష్మికి కొన్నేళ్లుగా మాన‌సిక ఆరోగ్యం దెబ్బతింది. కొంతకాలంగా పిచ్చిగా ప్రవర్తిస్తోంది. గంగలో (గోదావరి నదిని స్థానికులు గంగ అని పిలుచుకుంటారు) దూకి చనిపోతా.. అంటూ తరచూ కుటుంబ సభ్యులతో చెప్పేది. లక్ష్మి కుటుంబసభ్యులు తిరగని హాస్పిటళ్లు లేవు. ఎన్ని హాస్పిటళ్లలో చూపించినా, ఎంత మంది డాక్టర్లను సంప్రదించినా జబ్బు నయం కాలేదు. ప్రస్తుతం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మానసిక వైద్యుడి వద్ద ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం (డిసెంబర్ 7) ఉదయం నర్సయ్య తన రాత్రి విధులు ముగించుకుని ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో చూడగా తన భార్య లక్ష్మి కనిపించలేదు. ఆందోళనకు గురైన నర్సయ్య.. ఇంట్లో పడుకున్న కుమారుడు సంతోష్‌ను నిద్రలేపి లేపి ప్రశ్నించాడు. ‘అమ్మ నిద్ర పోతూ ఉందనే అనుకున్నా.. ఎటు వెళ్లిపోయిందో తెలియదు’ అని కుమారుడు చెప్పడంతో అతడి ఆందోళన రెట్టింపైంది. తండ్రీకుమారులిద్దరూ కలిసి లక్ష్మిని వెతకడానికి బయల్దేరారు. ఉదయం 8 గంటల సమయంలో గోదావరిఖనిలో గోదావరి నదిలో సమ్మక్క సారక్క గద్దెల సమీపంలో స్నానాల ఘాట్ వద్ద మహిళ మృతదేహం తేలుతూ కనిపించింది. ఆ సమాచారం అందుకున్న నర్సయ్య అక్కడి వచ్చి చూశారు. ఆ మృతదేహం తన భార్య లక్ష్మిదిగా నిర్ధారించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33QPlQ4

No comments:

Post a Comment