Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 7 December 2020

ఆస్పత్రిలో అమ్మకు సాయంగా ఉన్న అమ్మాయిపై అఘాయిత్యం

రోనా బారినపడి హాస్పిటల్‌లో చేరిన తల్లికి సాయంగా ఉన్న పదహారేళ్ల మైనర్ బాలికపై నలుగురు యువకులు అఘాయిత్యం చేశారు. హాస్పిటల్‌లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అమ్మాయికి మాయమాటలు చెప్పి తన కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం కారును హైవే పక్కన ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆపారు. నిందితుడితో పాటు అతడి స్నేహితులు కలిసి అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని శివ‌మొగ్గ ప‌ట్టణంలో శనివారం (డిసెంబర్ 5) సాయంత్రం ఈ దారుణం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. శివమొగ్గకు చెందిన ఓ మహిళకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో 15 రోజుల కిందట పట్టణంలోని మెక్‌గాన్ కొవిడ్ కేర్ సెంటర్లో చేరింది. నాటి నుంచి అక్కడే చికిత్స పొందుతోంది. త‌ల్లి బాగోగులు చూసేందుకు ఆమె కుమార్తె (16) రోజూ అక్కడికి వస్తోంది. పేషెంట్‌తో పాటు ఉన్న అటెండర్లను కొవిడ్ వార్డులోకి అనుమతించకున్నా.. వారి అవసరాలు తీర్చడానికి, కిటికీలో నుంచి చూడటానికి అనుమతి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆ బాలిక రోజులో అధిక భాగం హాస్పిటల్ వద్దే ఉంటోంది. హాస్పిటల్‌లో కాంట్రాక్టు వర్కర్‌గా ప‌నిచేస్తున్న ఓ యువ‌కుడు ఆ బాలికపై కన్నేశాడు. ఆమెతో మెల్లిగా పరిచయం పెంచుకున్నాడు. పక్కా ప్రణాళికతో ఆమెను మోసం చేశాడు. శ‌నివారం ఎప్పటిలాగే హాస్పిటల్‌కు వ‌చ్చిన బాలిక‌కు డిన్నర్‌కు తీసుకెళ్తానని నిందితుడు మాయమాటలు చెప్పాడు. కారులో లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్తానని, ఆ తర్వాత మంచి హోటల్‌లో భోజనం చేయించి, తిరిగి హాస్పిటల్ వద్ద దిగబెడతానని నమ్మబలికాడు. అందుకు ఆ అమ్మాయి ఓకే చెప్పింది. ఆస్పత్రి వద్ద ఉన్న అమ్మాయిని తన కారులో ఎక్కించుకున్న నిందితుడు లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మార్గమధ్యంలో ముగ్గురు స్నేహితులను ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను నేరుగా సిటీకి 20 కి.మీ. దూరంలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ హైవే పక్కన కారును నిలిపేసి.. వాహనంలో బాలికపై అఘాయిత్యం చేశారు. అనంతరం ఏమీ ఎరుగనట్టు బాలికను కారులో తీసుకొచ్చి హాస్పిటల్ వద్ద దించేసి వెళ్లిపోయారు. తనపై జరిగిన దారుణాన్ని తలచుకొని కుమిలిపోయిన బాలిక.. జ‌రిగిన సంగ‌తి మొత్తం త‌ల్లికి చెప్పుకొని బోరుమంది. ఆ విషయం తెలిసి తల్లడిల్లిన ఆమె త‌ల్లి బంధువులు, హాస్పిటల్ సిబ్బంది సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.. Also Read: Must Read: Don't Miss: Video: నిజామాబాద్: కారు బీభత్సం.. చిన్నారులను దేవుడే కాపాడాడు!


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37JZYFk

No comments:

Post a Comment