బాదల్ కాన్వాయ్‌పై దాడి, అడ్డుగా నిలిచి కాపాడిన కార్యకర్తలు.. ముగ్గురికి బుల్లెట్ గాయాలు

పంజాబ్‌లోని జలాలాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీనియర్‌ రాజకీయ నాయకుడు, శిరోమణి అకాళీదల్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ కాన్వాయ్‌పై కొంత మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారు. కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో బాదల్ కాన్వాయ్‌లోని ఒక వాహనం తీవ్రంగా దెబ్బతిన్నది. శిరోమణి అకాళీదల్‌కు చెందిన ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది తమ నాయకుడిపై దాడికి పాల్పడ్డారని నేతలు ఆరోపించారు. అల్లరిమూకలను అదుపుచేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మంగళవారం (ఫిబ్రవరి 2) తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు శిరోమణి అకాళీదల్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ జలాలాబాద్‌ వచ్చారు. ఈ సమయంలో ఈ దాడి జరిగింది. కాంగ్రెస్, శిరోమణి అకాళీదల్ పార్టీ వర్గాలు ఒకే సమయంలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటలయుద్ధం చోటు చేసుకుంది. అనంతరం కాంగ్రెస్‌ కార్యకర్తలతో అకాళీదల్‌ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా బాదల్ కాన్వాయ్‌పై దాడికి దిగారు. కొంత మంది అకాళీదల్ కార్యకర్తలు బాదల్ కాన్వాయ్‌కు అడ్డుగా నిలిచి ఆయణ్ని కాపాడారు. ఘటనా స్థలం నుంచి ఆయణ్ని పక్కకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురు కార్యకర్తలకు బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి రెండు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. దాడి ఘటనకు సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. మరోవైపు.. ఆప్‌ పంజాబ్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భగవంత్ మన్‌ కూడా జలాలాబాద్‌ పర్యటనకు వస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. Also Read: ★ ★


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3czeNii

Post a Comment

0 Comments