లడఖ్ సరిహద్దులో యుద్ధ ట్యాంకులను మోహరించిన చైనా

డఖ్ సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఓ వైపు చర్చలు జరుగుతుండగా.. మరోవైపు తన వక్రబుద్ధిని చాటుకుంటోంది. సరిహద్దుకు సమీపంలో భారీగా సైనికులను మోహరించింది. యుద్ధ ట్యాంకులను తరలించింది. లడఖ్‌లో నియంత్రణ రేఖ (LAC)కు సమీపంలో చైనా జవాన్లు పెద్ద ఎత్తున మిలిటరీ క్యాంపులను ఏర్పాటు చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. Times Now కెమెరాకు చిక్కిన ఆ వీడియోలో సరిహద్దుకు సమీపంలో చైనా వైపున 350 యుద్ధ ట్యాంకులు కనిపిస్తున్నాయి. వీటిలో చైనాకు చెందిన అత్యాధునిక యుద్ధ ట్యాంకు Type 99 కూడా ఉంది. లడఖ్‌లోని దస్పంగ్ ప్రాంతంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో యుద్ధ సామగ్రిని తరలించినట్లు తెలుస్తోంది. లడఖ్‌లో గతేడాది మే 5 నుంచి భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపున కూడా రెట్టింపు నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా రాసింది. అయితే.. చైనా మాత్రం దీనిపై ఇప్పటికీ నోరు మెదపలేదు. గల్వాన్ ఘర్షణ అనంతరం సరిహద్దులో ఉద్రిక్తలు తీవ్రమయ్యాయి. సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై చర్చించారు. ఇరువైపులా బలగాల ఉపసంహరణకు అంగీకరించారు. కానీ, డ్రాగన్ పదే పదే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3cxR5Tx

Post a Comment

0 Comments