
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటివరకు 313 మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాజ్యసభలో సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు వివరాలు తెలిపింది. వీరిలో 162 మంది డాక్టర్లు ఉన్నట్లు తెలిపింది. కొవిడ్ కారణంగా 107 మంది నర్సులు, 44 మంది ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కొవిడ్ మరణాలపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే రాజ్యసభలో ఈ వివరాలు వెల్లడించారు. జనవరి 22 నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ గణాంకాలను తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ మరణాలను ధ్రువీకరించినట్లు చెప్పారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచిన వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ (PMGKP) కింద పరిహారం అందుతుందని మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు. కరోనా మహమ్మారితో పోరులో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలచివేసింది. మరోవైపు.. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు లక్షన్నరకు పైగా మృతి చెందారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3cBlWOS
No comments:
Post a Comment