Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 28 March 2021

అమిత్ షాతో పవార్ రహస్య భేటీ.. సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలకు ఆజ్యం పోసిన శివసేన!

హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలతో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో అలజడి మొదలైన విషయం తెలిసిందే. అనిల్ దేశ్‌ముఖ్‌ వ్యవహారంపై న్యాయవిచారణకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ విషయాన్ని స్వయంగా హోం మంత్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్య శనివారం రహస్య భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ, ఈ భేటీకి సంబంధించి ఎటువంటి వివరాలూ బయటకు రాలేదు. అయితే, ఆదివారం జరిగిన సమావేశంలో అమిత్‌ షాను మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించగా.. ఆయన తనదైన శైలిలో ‘ప్రతి అంశం బయటకు చెప్పలేం’ కదా అని సమాధానం ఇచ్చారు. తమ మధ్య భేటీ జరిగిందని గానీ, జరగలేదని గానీ షా ధ్రువీకరించకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీకి చెందిన హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు వచ్చిన వేళ షాతో పవార్ భేటీ అయినట్టు స్థానిక మీడియాలో ప్రచారం జరిగింది. ఎన్సీపీ చీఫ్, ఆ పార్టీకి చెందిన మరో నేత ప్రఫుల్ పటేల్‌లు అహ్మదాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో శనివారం అమిత్‌షాతో భేటీ అయినట్లు గుజరాత్ మీడియా వెల్లడించింది. ఓవైపు హోంమంత్రి రాజీనామాకు ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తున్న వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ కేవలం వీరి మధ్యే జరిగిందా? ఇంకెవరైనా పాల్గొన్నారా? ఇంతకీ ఏం చర్చించారు? అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. మరోవైపు, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’లో కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన అనుకోకుండా హోంమంత్రి అయ్యారు.. అయినా ముంబయి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో వాజే కూర్చుని వసూళ్లకు తెరలేపిన విషయం హోంమంత్రికి తెలీకపోవడం ఏంటి’అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. రౌత్‌ వ్యాఖ్యలు, పవార్‌ రహస్య భేటీ పరిణామాలు చూస్తుంటే మహారాష్ట్రలో మరోసారి రాజకీయాలు రక్తికట్టించేలా కనిపిస్తున్నాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3ryjOLH

No comments:

Post a Comment