Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 26 March 2021

సీఎంను స్టాలిన్ చెప్పుతో పోల్చిన డీఎంకే నేత.. ఈపీఎస్ స్ట్రాంగ్ కౌంటర్

తమిళనాడు ఎన్నికలకు ఏప్రిల్ 6 పోలింగ్ జరగనుండగా.. అన్ని ప్రధాన పార్టీలూ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, నేత రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం పళనిస్వామి స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువకూడా చేయరు’ అంటూ రాజా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ‘ఒకప్పుడు బెల్లం మార్కెట్‌‌లో కూలీగా పనిచేసి పళనిస్వామికి స్టాలిన్‌తో పోటీయా? పళని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకు విలువ ఎక్కువ.. స్టాలిన్‌నే సవాల్ చేసే ధైర్యం ఉందా’ అని ఎన్నికల ప్రచారంలో రాజా ధ్వజమెత్తారు. ‘నెహ్రూ, ఇందిరా గాంధీ లేదా మోదీచేయలేని సాహసం ఎడప్పాడి చేస్తున్నాడంటే అందుకు కారణం డబ్బు.. రాష్ట్రాన్ని లూటీచేసిన తనను పార్టీని రక్షిస్తుందని భావిస్తున్నాడు.. అటువంటి వ్యక్తి స్టాలిన్‌ను అడ్డుకుంటాను అంటున్నారు... అదే జరిగితే సీఎం వాహనం తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లదని నేను సవినయంగా మనవిజేస్తున్నాను’ అని అన్నారు. డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ఎడప్పాడి ప్రారంభించారు. తాను ఒక రైతు అని, ఒక పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానని ప్రజల్లోకి దీనిని బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. మదురై జిల్లా మెలూర్‌లోని ఎన్నికల ప్రచారంలో సీఎం ఈపీఎస్ మాట్లాడుతూ..‘తాను కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానని, స్టాలిన్ తండ్రి సీఎంగా ఉన్నందున ఆయన సిల్వర్ స్పూన్‌తో పుట్టారు’అన్నారు. ఈ సందర్భంగా 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని ప్రస్తావించిన సీఎం.. కంటికి కనిపించని గాలితో కూడా కుంభకోణాలు చేసిన ఏకైక పార్టీ డీఎంకే అని ధ్వజమెత్తారు. ‘ఆయన మాట్లాడిన భాష ఏమిటో చూడండి.. నా విలువ స్టాలిన్ ధరించే చెప్పు కన్నా తక్కువని ఎలా మాట్లాడతారో చూడండి... ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో ఎలా పోల్చగలడు? నేను ఒక రైతును, మా పేదలు అలానే ఉంటారు.. మేము కష్టపడి పనిచేస్తాం.. మేం కొనుక్కోగలిగింది మాత్రమే కొనుగోలు చేస్తాం... కానీ వారు రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం వెనుక ఉన్నారు కాబట్టి కోరుకున్నది కొనుక్కోవచ్చు’ అని కౌంటర్ ఇచ్చారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3fhRef2

No comments:

Post a Comment