Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 17 July 2021

అనారోగ్య కారణాలతో రాజీనామాకు సిద్ధమైన సీఎం యడియూరప్ప..!

తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకుంటానని ప్రధానికి యడియూరప్ప చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. ఒకవేళ యడియూరప్పను తొలిగించాలని బీజేపీ నిర్ణయిస్తే.. జులై 26 నాటికి నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించాయి. ప్రస్తుతం ఆయన పదవీ కాలం జులై 26 నాటితో రెండేళ్లు పూర్తవుతుంది. ‘మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను.. అందుకు నేను సిద్ధమే.. బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను... ఒకవేళ మీరు రాజీనామా చేయమంటే చేస్తాను’’ అని యడియూరప్ప ప్రధాని మోదీతో స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాదు, అధిష్ఠానం ముందు యడ్డీ కొన్ని షరతులు ఉంచినట్లు తెలుస్తోంది. తన కుమారులకు జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించి, కీలకమైన పదవులిచ్చి సహకరిస్తే, తాను పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగానే ఉన్నానని యడియూరప్ప తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. కుమారుడు విజయేంద్ర, రాఘవేంద్రలను వెంటబెట్టుకుని యడియూరప్ప ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అటు ప్రధానితో భేటీ అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడామని యడియూరప్ప తెలిపారు. అంతేకాదు, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, తనను పదవి నుంచి వైదొలగమని ఎవరూ కోరలేదని ప్రకటించారు. ‘‘రాజీనామాకు సంబంధించిన వార్తలన్నీ వదంతులే. రాజీనామా చేసే ప్రసక్తే లేదు. కర్నాటక ప్రాజెక్టులపై చర్చించేందుకే ఢిల్లీకి వచ్చా. వచ్చే నెలలో కూడా మరోసారి ఢిల్లీకి వస్తా.. 2023 సాధారణ ఎన్నికలు సహా వివిధ అంశాలను ప్రధానితో చర్చించాం.. ఢిల్లీ పర్యటన వెనుక ఎటువంటి ప్రాధాన్యత లేదు’’ అని యడియూరప్ప ప్రకటించారు. మరోవైపు, ముఖ్యమంత్రి పర్యటన తర్వాత రాష్ట్ర మంత్రుల్లో కొందరు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌ మాట్లాడుతూ.. ఎస్‌.టి.సోమశేఖర్‌, భైరతి బసవరాజులతో పాటు మరికొందరు మంత్రులంతా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. మా శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై ఆయా కేంద్ర మంత్రులతో చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో మరోసారి కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3inqqd8

No comments:

Post a Comment