Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 16 July 2021

అది వన్ వే అనుసంధానమే.. ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై చైనాకు భారత్ చురకలు!

తాష్కెంట్ వేదికగా జరిగిన ప్రాంతీయ సమావేశంలో చైనా ‘ఒన్ బెల్డ్ ఒన్ రోడ్’ ప్రాజెక్టుపై చురకలంటించారు. ‘అనుసంధాన నిర్మాణం అనేది నమ్మకమైన చర్య... ఇది సార్వభౌమత్వాన్ని గౌరవించడం.. ప్రాదేశిక సమగ్రత విషయంలో అంతర్జాతీయ సంబంధాలు, ప్రాథమిక సూత్రాలు, చట్టాలను నిర్దేశించాల్సిన అవసరం ఉంది’ అని ఎస్ జయశంకర్ అన్నారు. అంతేకాదు, ఈ ప్రయత్నాలు ఆర్థిక సామర్థ్యం, ఆర్థిక బాధ్యతపై ఆధారపడి ఉండాలి గానీ, చైనా ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ) మాదిరిగా రుణ భారాన్ని సృష్టించవద్దని వ్యాఖ్యానించారు. అనుసంధానం అనేది ఏకపక్షంగా ఉండకూడదని, ఇటువంటి వాటి వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఐలో భాగంగా అనేక దేశాలను ఆర్ధిక సాయం పేరుతో చైనా రుణాల ఊబిలోకి లాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్య, దక్షిణ ఆసియా మధ్య అనుసంధానం విషయంలో భౌతిక మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు, దానితో పాటు వచ్చే కోణాలను పరిగణనలోకి తీసుకోవాలని జయశంకర్ సూచించారు. ‘మధ్య ఆసియా, దక్షిణ ఆసియా... అనుసంధానం’ అనే అంశంపై ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్ వేదికగా జరిగిన కాన్ఫరెన్స్‌లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అఫ్గన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సహా 35 దేశాలకు చెందిన నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ‘పర్యాటకం, సామాజిక పరిచయాలు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టించగలవు.. కానీ, చివరికి అనుసంధానం నిర్మించడం అనేది నమ్మకమైన చర్య.. కనీసం అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉండాలి.. సార్వభౌమత్వాన్ని గౌరవించడం, ప్రాదేశిక సమగ్రత అనేవి అంతర్జాతీయ సంబంధాలకు ప్రాథమిక సూత్రాలు’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ‘ఇవి ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించాలి.. రుణ భారాన్ని సృష్టించకూడదు.. పర్యావరణ ప్రమాణాలు, నైపుణ్యం, సాంకేతికత ఇచ్చిపుచ్చుకోవడం ముఖ్యం.. అనుసంధానం తప్పనిసరిగా సంప్రదింపులు, పారదర్శకత, పాల్గొనేదిగా ఉండాలి’ అని అన్నారు. ‘అఫ్గనిస్థాన్‌తోనూ విశ్వసనీయమైన అనుసంధానం కోసం ప్రపంచానికి తన యంత్రాంగంపై విశ్వాసం ఉండాలి.. అభివృద్ధి, శ్రేయస్సు, శాంతి, భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి.. దీనికి సంబంధించిన చర్చలలో సామర్థ్యం, కాలానుగుణంగా నిబంధనలను పాటించాలని ఆశిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వృద్ధి ‘కనెక్టివిటీ, కామర్స్, కాంటాక్ట్స్’ అనే మూడు సీల ద్వారా నడుస్తోందని ఎస్ జైశంకర్ అన్నారు. ప్రాంతీయ సహకారం, శ్రేయస్సును నిర్ధారించడానికి ఈ మూడు కలిసి రావాలని నొక్కిచెప్పారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3ieX5Se

No comments:

Post a Comment