Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 17 July 2021

సిద్ధూ Vs సీఎం.. సోనియాకు అమరీందర్ సంచలన లేఖ

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌ అధికార కాంగ్రెస్‌ పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. అసమ్మతిని చల్లార్చడానికి కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ అంశంపై రెబల్ నేత నవజోత్ సింగ్ సిద్ధూను ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. ఆయనను బుజ్జగించిన కాంగ్రెస్ పెద్దలు.. పీసీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తాజాగా లేఖ రాయడం కలకలం రేగుతోంది. తనపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న సిద్ధూకు పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ అమరీందర్‌ సింగ్‌ శుక్రవారం లేఖ రాశారు. పంజాబ్‌ కాంగ్రెస్‌లో హిందువులు, దళితులతో కూడిన సీనియర్‌ నేతలను విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని అమరీందర్‌ తన లేఖలో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి, పీసీపీ అధ్యక్ష బాధ్యతలు ఒకే సామాజిక వర్గానికి అప్పగించడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, సిద్ధూ వర్కింగ్ స్టైల్ గురించి కూడా అమరీందర్ ప్రస్తావించినట్టు సమాచారం. ఒకవేళ సిద్ధూకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే చాలా మంది కాంగ్రెస్ నేతలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని.. దీని వల్ల పార్టీ చీలిపోతుందని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పంజాబ్ వ్యవహారాల ఇంఛార్జ్ హరీశ్‌ రావత్‌ హుటాహుటిన ఆ రాష్ట్రానికి బయలుదేరారు. సిద్ధూకు పీసీసీ పగ్గాల అప్పగింతపై ప్రకటన వస్తుందని భావిస్తుండగా, రావత్‌ ఇవాళ సీఎం అమరీందర్‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకు ముందు సోనియా గాంధీతో సిద్ధూ శుక్రవారం సమావేశమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పంజాబ్ వ్యవహారాల ఇంఛార్జ్ హరీష్ రావత్‌తో కలిసి సిద్ధూ భేటీ అయ్యారు. అనంతరం రావత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నివేదిక సమర్పించడానికి వచ్చాను.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిపై తుది నిర్ణయం సోనియా గాంధీ తీసుకుంటారు’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండటంతో సిద్ధూ మద్దతుదారులు ఆయనకు స్వాగతం పలకడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3igY6ta

No comments:

Post a Comment