Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 17 July 2021

బీజేపీకి భయపడేవారు వెళ్లిపోవచ్చు.. ఆ నేతలకు రాహుల్ స్ట్రాంగ్ మెసేజ్!

కాంగ్రెస్‌కు నిర్భయమైన నాయకులు అవసరమని, భయపడేవారు పార్టీ నుంచి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్టీ సోషల్ మీడియా బృందంతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసిన రాహుల్.. ఫిరాయింపుదారులు, అసమ్మతివాదులకు బలమైన సందేశం పంపారు. భయపడని వారు చాలా మంది కాంగ్రెస్ వెలుపల ఉన్నారని, వారిని పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి వలస వెళ్లిన నేతలపై రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను చూసి భయపడేవారే కాంగ్రెస్‌ను వీడి ఆ పార్టీలో చేరుతున్నారని... కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా అలాగే వెళ్లారని అన్నారు. తన రాజభవనాన్ని, సంపదను కాపాడుకోలేనన్న భయంతోనే సింధియా అందులో చేరారని రాహుల్ ఆరోపించారు. అంతేకాదు, బీజేపీకి భయపడే వారు ఇంకా ఎవరైనా ఉంటే స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని, తమకెలాంటి అభ్యంతరంం లేదని స్పష్టం చేశారు. ధైర్యవంతులే కాంగ్రెస్‌కు అవసరమని, అలాంటివారు తమ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. ‘ధైర్యవంతులైన నాయకులే అవసరం.. ఇది మన సిద్ధాంతం.. నా ప్రాథమిక సందేశం కూడా ఇదే’ అని రాహుల్ స్పష్టం చేశారు. దాదాపు 3,500 మంది కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలతో జూమ్‌ యాప్‌ ద్వారా రాహుల్‌ మాట్లాడారు. అబద్ధాలను ప్రచారం చేయడమే వ్యూహమని రాహుల్ దుయ్యబట్టారు. పరోక్షంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన జీ-23 నేతలకు రాహుల్ గాంధీ హెచ్చరికలు పంపారు. కాగా, గతేడాది మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన విషయం తేలిసిందే. అనంతరం బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రిగా ఇటీవల నియమించారు. అలాగే, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన జితిన్ ప్రసాద్ సైతం కాంగ్రెస్‌ను వీడి ఇటీవల బీజేపీలో చేరారు. యూపీకి చెందిన ఆయనకు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ భావిస్తోంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/36OA9nn

No comments:

Post a Comment