
వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకున్న జంట పేలుళ్ల నుంచి దాదాపు 160 మంది సిక్కులు, హిందువులు త్రుటిలో తప్పించుకున్నారు. అఫ్గన్‌లో మైనార్టీలైన వీరంతా కాబూల్ విమానాశ్రయం సమీపంలోని ఓ గురుద్వారాలో తలదాచుకుంటున్నారు. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు కొద్ది గంటల ముందు దాదాపు 145 మంది అఫ్గన్ సిక్కులు, 15 మంది హిందువులు ఆ ప్రాంతంలో ఉన్నారు. తాలిబన్ల భయంతో అఫ్గన్ విడిచి వెళ్లిపోయేందుకు వీరంతా వేచిచూస్తున్నారు. ఈ బృందం గురువారం ఉదయమే విమానాశ్రయం నుంచి గురుద్వారాకు తిరిగొచ్చింది. అఫ్గన్ నుంచి వెళ్లిపోతున్న విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఐఎస్ ఉగ్రవాదులు కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 103కి చేరింది. మరో 150 మందికిపైగా గాయపడ్డారు. చనిపోయినవారిలో చిన్నారులు, మహిళలు, అమెరికా సైనికులు సైతం ఉన్నారు. ఈ దాడిలో 13 మంది అమెరికా సైనికులు.. 90 మంది అఫ్గాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య 150కి చేరిందని కాబుల్ అధికారులు వెల్లడించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ దాడికి ఐఎస్‌ఐఎస్-ఖోర్సా బాధ్యత తీసుకొంది. మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు ప్రకటించారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. సిక్కులు, హిందువుల బృందం మారణహోమం నుంచి త్రుటిలో తప్పించుకోగలిగింది అన్నారు. విమానాశ్రయంలో ఎక్కడైతే పేలుడు చోటుచేసుకుందో.. ఆ ప్రదేశంలోనే వీరంతా గురువారం ఉదయం వరకూ ఉన్నారని తెలిపారు. వారు అక్కడ నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఘటన జరిగింది. వారు ఉండే సమయంలో జరగకపోవడంతో ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వ్యాఖ్యానించారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3znSMLQ
No comments:
Post a Comment