హోటల్‌కో.. రెస్టారెంట్‌కో వెళ్లి.. ఆర్డర్ ఇచ్చిన చాలా సేపటికి కానీ మన టేబుల్‌పైకి రాదు. కానీ ఓ రెస్టారెంట్లో అటువంటి బాధ లేదు. అక్కడకు వెళ్లి ఇలా ఆర్డర్ ఇస్తే.. వెయిటర్స్ అలా తెచ్చేస్తారు. దాంతో ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌ను కూడా సాధించింది. మెక్సికోలో గారిబాల్డి రెస్టారెంట్‌లో ()కస్టమర్లు ఆర్డర్ చేసిన 13.5సెకన్ల వ్యవధిలోనే ఫుడ్ అందిస్తారు. ఈ ప్రత్యేకత వల్లే కస్టమర్లు అక్కడకు మళ్లీ మళ్లీ వెళ్తుంటారు. ఆ రెస్టారెంట్‌కు కస్టమర్లు క్యూ కడుతున్నారు. కస్టమర్లకు ఎవరు వేగంగా ఫుడ్ సర్వ్ చేస్తారనేదానిపై అక్కడున్న వెయిటర్‌లు సరదాగా పోటీ పడ్డారు. ఇదే సీరియస్‌గా అలవాటై గిన్నీస్ వరల్డ్ రికార్డు సంపాదించి పెట్టింది. దీంతో ఆ రెస్టారెంట్‌కు మరింత పాపులర్ అయింది. 1996, ఆగస్టు 31వ తేదీన 13.5 సెకన్లలో అందించారు. ఇప్పటికీ ఈ రెస్టారెంట్ ఇదే పద్ధతిని కొనసాగిస్తోంది. ఇంత వేగంగా ఫుడ్ సర్వ్ చేయడంతో కస్టమర్లు చాలా సంతోషంగా అక్కడకు వెళ్తున్నారు. మెక్సికన్ వంటలు తయారు చేయానికి గంటల తరబడి సమయం పడుతుందట. అందుకని రెస్టారెంట్‌లో అన్ని పదార్థాలను ముందుగానే సిద్ధం చేసుకుంటారు. వాటిని చక్కగా ప్లేట్‌లో పెట్టేస్తారు. ఎవరైనా వచ్చి ఆర్డర్ చేసిన వెంటనే ఆయా ఆహార పదార్థాలను వెంటనే వారి టేబుల్‌పై తీసుకెళ్లి పెట్టేస్తారు. ఈ పని వేగంగా జరగడానికి వెయిటర్స్ మధ్య కమ్యూనికేషన్ అంతే వేగంగా ఉంటుంది. సంకేతాలతో కమ్యూనికేట్ చేసుకోవడానికి వారికి రెస్టారెంట్ శిక్షణ కూడా ఇస్తుంటుంది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/33AW82N
0 Comments