దేశంలో కోవిడ్ విజృంభణతో అన్ని కార్యక్రమాలు వర్చువల్ పద్ధతిలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎలా జరుగుతాయో అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈసారి రెండు విడతల్లో సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మొదటి రోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం పార్లమెంట్‌లో శానిటేషన్ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పరిశీలించారు. ఈ సందర్భంగా 60 ఏళ్లు పైబడిన ఎంపీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాలకు పార్లమెంట్‌లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా ఇటీవల పార్లమెంట్‌లో 400 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జనవరి 4 నుంచి 8 తేదీల మధ్య ఈ కేసులు వెలుగు చూశాయి. పార్లమెంట్‌లో 1409 సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 402మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 200 మంది లోక్‌సభ సిబ్బంది, 69 మంది రాజ్యసభ సిబ్బంది, 133 మంది అనుబంధ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారితో కాంటాక్ట్ అయిన కొంతమంది ఐసోలేషన్‌లో ఉన్నారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3zY44Hw
0 Comments