చెవిపోటుతో అవస్థలు పడ్డ వ్యక్తి…. బొద్దింకను బయటకు తీసిన డాక్టర్

బొద్దింకను ఇంట్లో ఎక్కడైనా చూస్తేనే చికాకు పడతాం. అలాంటిది ఒంట్లో ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదా. అలాంటిది ఓ వ్యక్తి చెవిలో మూడు రోజుల పాటు ఉంది. ఆ అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశాడు. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించమని సలహా కూడా ఇచ్చాడు. న్యూజిలాండ్‌లో ఆక్లాండ్‌కు చెందిన జేన్ వెడ్డింగ్‌ చెవిలో బొద్దింక దూరడంతో నానా అవస్థలు పడ్డాడు. వెడ్డింగ్‌ స్విమ్మింగ్‌కు వెళ్లి వచ్చిన దగ్గర నుంచి తన ఎడమ చెవిలో సమస్య మొదలైంది. చెవిలోకి నీరు వెళ్లిపోయిందనుకుని అదే సర్దుకుంటుందని ఊరుకున్నాడు. అయితే కొంత సమయానికి చెవి పూర్తిగా మూసుకుపోయింది. శబ్దాలు వినిపించలేదు. పైగా నొప్పి మొదలైంది. దాంతో దగ్గరకు వెళ్లాడు. అయితే ఆ డాక్టర్ మందులు ఇచ్చేసి పంపించేశారు. మందులు వాడినా చెవిలో బాధ తీరలేదు. బాధ భరించలేక జేన్ వెడ్డింగ్ ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించాడు. ఆయన చెక్ చేసి చెవిలో ఏదో పురుగు ఉన్నట్టుందని వెడ్డింగ్‌కు చెప్పారు. కొన్ని పరికరాలను ఉపయోగించి దానిని బయటకు తీశారు. చెవి నుంచి దానిని తీయగా అది బొద్దింకని తెలిసింది. దాంతో జేన్ వెడ్డింగ్ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. మునుపెన్నడూ చనిపోయిన బొద్దింకను ఎవరి చెవిలోంచి బయటకు తీయలేదని ఆ డాక్టర్ వెడ్డింగ్‌కు చెప్పారు. కాగా మూడు రోజులు తన చెవిలో బొద్దింక ఉందని జేన్ వెడ్డింగ్ భయపడిపోయాడు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3ntA4hN

Post a Comment

0 Comments