థర్డ్ వేవ్‌లో కరోనా వైరస్ కేసులు తక్కువ రోజుల్లోనే రెట్టింపయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఒకానొక సమయంలో 20 శాతానికి చేరింది. అయితే, థర్డ్ వేవ్‌లో తొలిసారిగా గతవారం రోజువారీ కేసులు తగ్గడం సానుకూలాంశం. ఇదే సమయంలో మరణాలు 41 శాతం మేర పెరగడం ఆందోళనకరం. జనవరి 24 నుంచి 30 మధ్య దేశవ్యాప్తంగా 17.5 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంతో పోల్చితే ఇవి 19 శాతం తక్కువ. కొన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నా.. జాతీయ స్థాయిలో గరిష్ట స్థాయికి చేరుకుంటుందనే అభిప్రాయాన్ని బలపరుస్తుంది. అయితే, కేసుల సంఖ్య తగ్గడానికి టెస్టింగ్ కూడా తగ్గడమే కారణం. ముందువారంతో పోల్చితే కోవిడ్ నిర్దారణ పరీక్షలు 10 శాతం మేర తగ్గాయి. దీంతో వీక్లీ పాజిటివిటీ రేటు 17.28 శాతం నుంచి 15.68 శాతానికి పడిపోయింది. జనవరి 17-23 మధ్య వారం రోజుల్లో 21.7 లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. థర్డ్ వేవ్‌లో ఇప్పటి వరకూ ఇవే అత్యధికం. ఒకవేళ, దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో కరోనా వైరస్ కేసుల తగ్గుదల ఇలాగే కొనసాగితే థర్డ్ వేవ్ వేగంగానే ముగియనుంది. డిసెంబరు చివరి వారం నుంచి పెరిగిన కేసులు.. నాలుగు వారాల్లోనే గరిష్ఠానికి చేరాయి. అలాగే, తొలి రెండు దశలతో పోల్చితే ఈసారి కరోనా మరణాలు తక్కువగానే ఉండటం ఊరట కలిగిస్తోంది. వ్యాక్సినేషన్, వేరియంట్ తీవ్రత తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కానీ, ముందు రెండు వారాలతో పోల్చితే గతవారం నుంచి మరణాలు పెరుగుతుండటం కాస్త కలవరానికి గురిచేస్తోంది. జనవరి 17-23 మధ్య 2,680 మంది కరోనాకు బలికాగా.. గతవారం ఈ సంఖ్యలో పెరుగుదల నమోదయ్యింది. ఏకంగా 3,770 మరణాలు చోటుచేసుకున్నాయి. వీటికి కొన్ని రాష్ట్రాలు సవరించిన పాత మరణాలు లెక్కలు కలిపితే 5,203కి చేరుతాయి. ఇక, రోజువారీ కరోనా కేసులు.. శనివారం కంటే ఆదివారం మరింత తగ్గాయి. గడచిన 24 గంటల్లో 2.10 లక్షలకుపైగా కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/iytTZu3r7
0 Comments