రెండు రోజుల్లో కేసులు తగ్గే ఛాన్స్.. ఆంక్షలు ఎత్తివేస్తాం : మంత్రి సత్యేంద్ర జైన్

కోవిడ్ కేసులు తగ్గితే ఢిల్లీలో ఎత్తివేస్తామని వైద్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తోందని ఆయన అన్నారు. రెండు, మూడు రోజుల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడతాయని అంచనా వేశారు. ప్రస్తుతం 25 శాతం పాజిటివ్ రేటు కొనసాగుతోందని, అయితే దాని ఆధారంగా కేసులు గరిష్ట స్థాయికి చేరాయని చెప్పలేమని అన్నారు. రాష్ట్రంలో కొత్త కేసులు స్థిరంగా ఉన్నాయని, త్వరలోనే తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని సత్యేంద్ర జైన్ అన్నారు. అలాగే కోవిడ్‌తో ఆస్పత్రిల్లో చేరేవారి సంఖ్య నిలకడగా ఉందని, ముంబైలో కేసులు తగ్గినట్టే ఢిల్లీలోనూ అదే ట్రెండ్‌ని చూస్తామన్నారు. కోవిడ్ సోకిన వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం అవుతుందని చెప్పారు. కాగా ఢిల్లీలో కొన్నిరోజులుగా 20,000 నుంచి 22,000 కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కారణంగా ఒక్కరోజే 23 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు కారణంగా రాష్ట్రంలో ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయాలని, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాలని మంగళవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఆ సందర్భంగా లాక్‌డౌన్ ప్రకటిస్తారనే వార్తలని సీఎం ఖండించారు. లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని ప్రజలు టెన్షన్ పడవద్దని చెప్పారు. అలాగే వైరస్ వ్యాప్తి తగ్గిందని అన్నారు. అక్కడ గత నెల నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. రెస్టారెంట్లు, బార్‌లు కూడా క్లోజ్ చేయబడ్డాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3GksJbW

Post a Comment

0 Comments