రోడ్డుపై అడ్డంగా కొండచిలువ.. అది వెళ్లేంత వరకూ ఆగిన వాహనాలు

ఓ తీరిగ్గా రోడ్డు దాటింది.. దానికి అడ్డుపడకుండా వాహనదారులు వెయిట్ చేసి దానికి కోపరేట్ చేశారు. అది వెళ్లడానికి 4,5 నిమిషాలు సమయం పట్టింది అప్పటి వరకూ వాహనదారులు నిరీక్షించక తప్పలేదు. కొచ్చి ఎయిర్‌పోర్టు రోడ్డుపై ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్పటి వరకూ బిజిగా తిరిగే సడన్‌గా ఆగిపోయాయి. ట్రాఫిక్ సిగ్నల్ పడకపోయినా వాహనదారులు తమకు తామే ఆగిపోయారు. ఎందుకంటే ఓ కొండచిలువ నిదానంగా రోడ్డు దాటడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కేఎస్‌ఈబీ ఆఫీసు సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఓ కొండ చిలువ కనిపించింది. రెండు మీటర్ల పొడవున్న అది చాలా నెమ్మదిగా రోడ్డు దాటింది. అయితే ఆ పాము ఏ వాహనాల సౌండ్స్‌కు భయపడలేదు. హారన్లు వినిపించినప్పటికీ ఏ మాత్రం చలించకుండా ముందుకు వెళ్తూనే ఉంది. రోడ్డు దాటి అలా పొదల్లోకి వెళ్లి వెంటనే అదృశ్యమైపోయింది. అక్కడ ఆగి చూసిన వాహనదారులు దానిని ఫోటోలు, వీడియోలు తీశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో రహదారిపై నెమ్మదిగా వెళ్తున్న పామును స్పష్టంగా చూడొచ్చు. దానికోసం అది వెళ్లేంత వరకూ రెండు వైపులా కార్లు, బైక్‌లు, లారీలు ఆగిపోయాయి. అంతేకాదు దానిని ఏ బండి ఢీ కొట్టకుండా చూసేందుకు కొందరు వ్యక్తులు కూడా రోడ్డు మధ్యలో నిలబడ్డారు. కాగా కొచ్చి ప్రాంతంలో కొండ చిలువలు తరచుగా కనిపిస్తూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కొచ్చి ప్రాంతం కొండ చిలువలకు బాగా అనువైన ప్రదేశం.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3thAGe3

Post a Comment

0 Comments