అధికారం చేతుల్లో ఉంటే కొందరు రెచ్చిపోతుంటారు. సామాన్యులపై వారి జులుంను ప్రదర్శిస్తారు. ఏదైనా సరే కొందరు తమ కాళ్ల దగ్గరకు రప్పించుకుంటారు. చిన్న తప్పులను కూడా సహించలేరు. ఏదైనా పొరపాటు జరిగితే.. సారీ చెప్పినా ఒప్పుకోరు. నిప్పులు చెరుగుతారు. అవతల వ్యక్తిని ఏదో ఒకటి చేసేంత వరకూ ఊరుకోరు. అలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఒక చిన్న పొరపాటుకు ఓ మహిళా పోలీస్ ఊహించని విధంగా రియాక్ట్ అయింది. రేవాలో ఓ వ్యక్తి తన మోటర్‌సైకిల్‌ను రివర్స్ చేయడానికి ప్రయత్నించాడు. దాంతో అక్కడే ఉన్న ఓ మహిళా పోలీస్ ఫ్యాంట్‌పై పడింది. వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆ మహిళా పోలీస్ తీవ్ర అసహనానికి గురైంది. బురదను చేయమని ఆ వ్యక్తిని బలవంతం చేసింది. దాంతో అతను వంగి ఆమె ప్యాంటును శుభ్రం చేశాడు. అయినా ఆమె శాంతించ లేదు. శుభ్రం చేసి వెళ్లే సమయంలో చెంపదెబ్బ కొట్టింది. తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె ఎవరో అప్పుడు ఎవరికి తెలియలేదు. ఒక స్కార్ఫ్‌తో ఆమె మొహం కవర్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పెట్టారు. వీడియో వైరల్ అయింది. దీంతో ఆ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అలా ప్రవర్తించిన మహిళ కలెక్టర్ కార్యాలయంలో పని చేసే హోం గార్డు శశికళగా గుర్తించారు. ఫిర్యాదు చేస్తే ఆమెపై చర్యలు తీసుకుంటామని రేవా ఎస్పీ శివకుమార్ తెలిపారు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3FkVuE1
0 Comments