ఒమిక్రాన్ సోకినవారిలో డెల్టాను అడ్డుకునే రోగనిరోధకత

కొత్తరకం వేరియంట్ మిగతా వాటి కంటే వేగంగా వ్యాప్తిచెందుతూ.. వ్యాక్సిన్ల వల్ల వచ్చిన రోగనిరోధకతను ఏమార్చి దాడిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఒమిక్రాన్‌ సోకినవారిలో రోగనిరోధక స్పందన గణనీయంగా ఉంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ రోగనిరోధకత ఒమిక్రాన్‌‌పైనే కాకుండా.. సహా ఇతర ఆందోళనకర వేరియంట్లను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు ఐసీపీఎం తెలిపింది. దీంతో డెల్టా వేరియంట్ వల్ల మళ్లీ కరోనా రాకుండా కూడా చేసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఒమిక్రాన్‌కు ప్రత్యేక టీకా వ్యూహం అవసరాన్ని అధ్యయనం నొక్కిచెప్పింది. అధ్యయనంలో భాగంగా ఒమిక్రాన్ బారినపడ్డ 88 మందిని పరిశీలించారు. వీరిలో 25 మంది ఆస్ట్రాజెన్‌కా.. ఎనిమిది మంది ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోస్‌లను తీసుకున్నారు. అలాగే, మరో ఆరుగురు టీకా తీసుకోనివారున్నారు. మొత్తం 28 మంది అమెరికా, బ్రిటన్, యూఏఈ వంటి దేశాల నుంచి వచ్చిన వారు కాగా.. 11 మంది వారికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. అయితే, టీకా వేసుకోనివారిలో వ్యాధినిరోధక స్పందన తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు ప్రగ్యా డి.యాదవ్‌, గజానన్‌ ఎన్‌. సపష్కాల్‌, రీమా ఆర్‌. సహాయ్‌, ప్రియా అబ్రహం తదితరులు ఈ అధ్యయనం చేపట్టారు. ఈ ఫలితాలను బయోరిక్సివ్ ప్రీప్రింట్ సర్వర్‌లో జనవరి 26న ప్రచురించారు. అయితే, వీటిని సమీక్షించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు, మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వాతావరణంలో ఎక్కువ కాలం సజీవంగా ఉంటున్నట్టు జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ వేరియంట్ ప్లాస్టిక్‌పై సుమారు 8 రోజులు, చర్మంపై 21 గంటలకుపైగా సజీవంగా ఉంటుందని నిర్ధారణ అయ్యింది. అందుకే ఇది డెల్టాను మించి వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3HidIaM

Post a Comment

0 Comments