ఉత్తర్ ప్రదేశ్ అధికార బీజేపీలో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బయటపడుతోంది. రెండు రోజుల నుంచి యూపీలో జరుగుతున్న పరిణామాలు బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్రమంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు బీజేపీని వీడటం కమళనాథులకు మింగుడుపడటం లేదు. ఇప్పటికే క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులు సహా ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరో మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఓబీసీ నేత, మంత్రి బీజేపీ ప్రాథమిక సభ్వత్వానికి, పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. దీంతో యోగి క్యాబినెట్‌కు రాజీనామా నుంచి మంత్రుల సంఖ్య మూడుకు చేరగా.. బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే సంఖ్య ఎనిమిదికి చేరింది. ఓబీసీల్లో మంచి పట్టున్న ధరమ్ సింగ్ సైనీ నాలుగుసార్లు షహారన్‌పూర్ జిల్లా నకుద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల ముందు మంత్రుల రాజీనామాలు బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. ఇక, 2016కి ముందు బీఎస్పీలో ఉన్న ధరమ్ సైంగ్.. మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యతో కలిసి బీజేపీలో చేరారు. కాగా, మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య తన భవిష్యత్తు కార్యాచరణను శుక్రవారం వెల్లడిస్తానని తెలిపారు. తాను ఇంకా బీజేపీలో కొనసాగుతున్నానని అన్నారు. ‘నేను కేవలం మంత్రి పదవికే రాజీనామా చేశాను.. త్వరలోనే బీజేపీకి రాజీనామా చేస్తాను.. ప్రస్తుతం నేను సమాజ్‌వాదీ పార్టీలో చేరలేదు.. బీజేపీని నేను తిరస్కరించాను.. తిరిగి ఆ పార్టీలోకి వెళ్లే ప్రశ్నే లేదు’’ అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో జనవరి 14న ఎస్పీలో చేరుతున్నట్టు చెప్పారు. తనకు ఏ రాజకీయ నేత నుంచి కూడా పిలుపు రాలేదని తెలిపారు. అటు, ముఖ్యమైన ఓబీసీ నాయకుల వలసలతో ఖంగుతిన్న బీజేపీ అధినాయకత్వం.. అసమ్మతివాదులు, తిరుగుబాటు నేతలను బుజ్జగించే బాధ్యతను డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు అప్పగించింది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3ri10lG
0 Comments