కుక్కలంటే విశ్వాసానికి ప్రతీక. ఆ విషయం అందరికి తెలిసిందే. తమకు తిండి పెట్టి పోషించే యజమానుల కోసం అవి ఏమైనా చేస్తాయి. అయితే ఓ పెంపుడు నీటిలో మునిగిపోతున్న చిన్న పిల్లను రక్షించి దాని ప్రాణాలను కాపాడింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ కుక్క చేసిన పనికి నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఓ కాలువలో జింక పిల్ల చిక్కుకుంది. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా దాని వల్ల కాలేదు. నీటి వేగానికి అది కొట్టుకుపోతుంది. దానిని చూసిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను నీటిలోకి వదిలాడు. దాంతో ఆ శునకం వేగంగా వస్తున్న నీటి ప్రవాహంలో ఈదుకుంటూ వెళ్లి.. ఆ జింక పిల్లను నోట కరుచుకుని ఒడ్డుకు తీసుకొచ్చింది. అలా బయటకొచ్చిన కుక్కను యజమాని గుడ్ బాయ్ అంటూ మెచ్చుకున్నాడు. అలా కుక్క వల్ల జింక ప్రాణాలతో బయటపడింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియలేదు. నీటి ప్రవాహం నుంచి కుక్క.. జింకను తీసుకువచ్చిన దృశ్యాలను పెంపుడు కుక్క యజమాని వీడియో తీశాడు. Universal Gyan 4u అనే యూట్యూబ్ ఛానల్ ఆ వీడియోని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. తర్వాత ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికల్లో కూడా షేర్ చేశారు. దాంతో నెటిజన్లు ఆ కుక్క సాహసాన్ని చూసి నెటిజన్లు ముచ్చటపడిపోతున్నారు. మనుషుల బెస్ట్ ఫ్రెండ్ కుక్కేనంటూ కొందరు, ఇది నమ్మలేకపోతున్నామంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3rGQtRt
0 Comments