రైలు పట్టాలపై మంటలు… దగ్గరుండి మరీ నిప్పు పెడుతున్న సిబ్బంది

అమెరికాలోని చికాగోలో రైలు పట్టాలపై మంటలు చెలరేగుతున్నాయి. కణకణ మండే అగ్ని జ్వాలల మీదుగానే రైళ్లు దూసుకెళ్తున్నాయి. ఇదేదో ప్రమాదం వల్ల జరగలేదు.. అక్కడి అధికారులే ఇలా చేస్తున్నారు. విపరీతమైన చలి ఉండడంతో పట్టాలపై అగ్గి రాజేసి.. రైళ్ల రాకపోకల్లో ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా చూస్తున్నారు. ఆ దేశంలో ఉత్తర రాష్ట్రాల్లో డిసెంబర్ నుంచి విపరీతమైన చలి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం అక్కడ నగరాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. రోడ్లపై మోకాలు లోతు మంచుతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడబడితే అక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. అలా రైలు పట్టాలపై కూడా మంచు పడుతోంది. అలాంటి సమయంలో రైళ్లు నడిస్తే పట్టాలు విరిగిపోవడమో, లేదా పట్టాలు దూరంగా జరిగిపోయే ప్రమాదమో ఉంటుంది. కానీ పట్టాలపై మంచును తొలగించడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే రైల్వే సిబ్బంది ట్రాక్‌లపై మంటలు పెడుతున్నారు. ఆ వేడికి రైలు పట్టాలపై మంచు కరిగిపోవడమే కాకుండా రైళ్ల రాకపోకలు సాఫీగా సాగుతాయి. ఇలా మంటలు పెట్టేటప్పుడు సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా అతి శీతల వాతావరణం అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది. , మిచిగాన్, ఇండియానా పోలీస్, వాషింగ్టన్, న్యూయార్క్ ప్రాంతాలలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://bit.ly/3g9gfYY

Post a Comment

0 Comments