జమ్మూ కశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు… జైషే కమాండర్‌ సహా ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం

జమ్మూ కశ్మీర్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు హతమయ్యారు. ఇందులో జేఈఎమ్ కమాండర్ ఉగ్రవాది జాహిద్ వనీ కూడా ఉన్నాడు. పుల్వామాలోని నైరా ప్రాంతంలో, బుద్గామ్‌ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నట్టు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ పోరులో ఐదుగురు టెర్రరిస్టులు మృతి చెందారు. వీరంతా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించిన వారు. మరో పాకిస్థానీ ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఈ ఆపరేషన్‌లో ఏకే 56 రైఫిల్‌ను, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు. కాగా ఒక్క జనవరి నెలలోనే 11 ఎన్‌కౌంటర్‌లు జరగ్గా ఎనిమిది మంది విదేశీయులతో సహా 21 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అలాగే మరో తొమ్మిది మంది ఉగ్రవాదులను, 17 మంది ఉగ్రవాదుల సహచరులను అదుపులోకి తీసుకున్నాయి. అయితే గతంలో జరిగిన తొమ్మిది ఆపరేషన్లలో, ఏడుగురు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/cIv4kUAXJ

Post a Comment

0 Comments