వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ.. వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ, పాత నిబంధనల ప్రకారమే నియామకాలు

మహిళా ఉద్యోగుల నియామకానికి సంబంధించిన జారీ చేసిన ఉత్తర్వులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకుంది. మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న అభ్యర్థులు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ ఎస్‌బీఐ ఉత్వర్వులు జారీ చేసింది. వారు బిడ్డను ప్రసవించాక నాలుగు నెలల్లోపు ఉద్యగోంలో చేరేందుకు అనుమతిస్తామని పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 21 నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. దీంతో ఈ సర్క్యులర్‌ వివాదాస్పదం అయింది. దీనిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఉత్తర్వులపై ఢిల్లీ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ట్విట్టర్‌లో ఈ నోటీసులు షేర్ చేస్తూ ఇది మహిళల పట్ల వివక్ష చూపించడమేనని విమర్శించారు. పైగా ఇది చట్టవిరుద్ధమని కూడా తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ రూల్స్‌ను సత్వరం వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీపీఐ రాజ్య సభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తగ్గింది. జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. పాత నిబంధనల ప్రకారమే నియామకాలు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరు నెలల వరకు గర్భం ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరే అవకాశం కొనసాగనుంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/kDhIXomnJ

Post a Comment

0 Comments