అప్ఘానిస్థాన్‌లో రోజుకో అలజడి చోటుచేసుకుంటూనే ఉంది. ప్రతిదానిపైనా తాలిబన్ ప్రభుత్వం ఆంక్షలు పెడుతూనే ఉంది. దాంతో ఆ దేశ ప్రజలు ఆందోళన బాట పడుతున్నాారు. తాజాగా మహిళా నిరసనకారులపై కూడా విరుచుకుపడ్డారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. కాబూల్‌లో ఆందోళన చేస్తోన్న మహిళలను చెదరగొట్టేందుకు తాలిబాన్లు పెప్పర్ స్ప్రే వినియోగించారు. కాబూల్ యూనివర్సిటీ ఎదురుగా తమ హక్కుల కోసం 20 మంది మహిళలు పోరాటానికి దిగారు. ఒక్క దగ్గర నిలబడి ప్ల కార్డులతో నిరసన తెలిపారు. తమకు సమానత్వం కావాలని, న్యాయం కావాలని నినాదాలు కూడా చేశారు. అది తెలుసుకున్న తాలిబన్ ఫైటర్లు వాహనాల్లో అక్కడకు చేరుకుని వారిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. వారిని చెల్లాచెదురు చేశారు. ఆ నిరసనకారుల కళ్లల్లో మంటలు ఏర్పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇద్దరిని ఆస్పత్రిలో కూడా చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలపై దారుణమైన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దాంతో అక్కడ ప్రజలు ఆందోళనబాట పడుతున్నారు. కాగా తాలిబన్లు మ్యూజిక్‌పై ఆంక్షలు పెట్టడమే కాకుండా సంగీత పరికరాలను నాశనం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సంగీత కళాకారుడిని కొట్టి.. ఆయన ముందే హ్మారోనియం పెట్టెను తగలబెట్టారు. అంతేకాదు పెళ్లిళ్లలో పెద్ద సౌండ్‌లో పాటలు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు బట్టల షాపుల్లో ఉన్న ఆడ బొమ్మల .. తలలను నరికారు. షాపుల్లో తలలు లేకుండానే బొమ్మలను పెట్టాలనే నిబంధన పెట్టారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/33qfyYD
0 Comments