స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు… పెరిగిన పాజిటివిటీ రేటు

దేశంలో కోవిడ్ విలయం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 2,58,089 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. అయితే నిన్నటితో పోల్చుకుంటే 13,113 తక్కువగా కేసులు నమోదయ్యాయి. 358 మంది కరోనా కారణంగా చనిపోయారు. 1,51,7400 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 16,56,341 యాక్టివ్‌గా ఉన్నాయి. మరోవైపు దేశంలో కోవిడ్ పాజిటివ్ రేటు 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరిగింది. ఇక దేశంలో వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ కేసులు 8,209కి చేరుకున్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ బారిన పడిన 3109 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1738 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్లో 1672, రాజస్థాన్‌లో 1276, ఢిల్లీలో 549, కర్ణాటకలో 548, కేరళలో 536 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా రెండు వైరస్‌లతో దేశం పోరాడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. రెండు మహమ్మారులు పక్కపక్కనే నడుస్తోన్న పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ వైరస్‌తో పాటు, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. మరోవైపు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు దేశంలో 157.20 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 39 లక్షల డోసులు పంపిణీ జరిగింది. కాగా రాష్ట్రాల్లో కూడా కఠినమైన ఆంక్షలను అమలవుతున్నాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3fttinR

Post a Comment

0 Comments