నేతాజీకి ఘన నివాళులు.. ఆయన త్యాగం స్ఫూర్తిదాయకమన్న రాష్ట్రపతి

స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ జయంతి సందర్భంగా ఆయనకు దేశంలోని ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. 125వ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని నేతాజీ చిత్ర పటం వద్ద పుష్పాలను ఉంచి నివాళుల అర్పించారు. సుభాష్ చంద్రబోస్‌ను స్మరించుకుంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత దేశం ఆయనకు నివాళులు అర్పిస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన త్యాగం ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నమస్కరిస్తున్నానని, దేశానికి ఆయన చేసిన స్మారక సహకారానికి భారతీయుడుగా గర్విస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇదిఇలా ఉండగా సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని గణతంత్ర దినోత్సవాలను ఆదివారం నుంచే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇండియా గేట్‌ వద్ద నేతాజీ హోలోగ్రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అక్కడ గ్రానైట్‌తో విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు ఈ మధ్యే ప్రధాని ప్రకటించారు. ఆ గ్రానైట్ విగ్రహం నిర్మాణం అయ్యేంత వరకూ ఆ ప్రాంతంలో హోలోగ్రాం ప్రతిమ ఉండనుంది. మరోవైపు నేతాజీ జయంతి రోజున జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. దేశ ప్రజలంతా బోస్కు నివాళి అర్పించేందుకు వీలు కల్పించేలా సెలవు ఇవ్వాలని సూచించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3FRofbB

Post a Comment

0 Comments