కొలంబియా: కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి.. 35 మందికి గాయాలు

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమవుతోంది. సెంట్రల్ కొలంబియాలో భారీ వర్షాలకు విరిగిపడి కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికిపైగా గాయపడ్డారు. రిసారాల్డా ప్రావిన్సుల్లోని డోస్క్యూ‌బ్రదాస్ మున్సిపాల్టీ పరిధిలోని అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండచరియలు విరిగిపడి బండరాళ్లు, మట్టిలో ఇళ్లు కూరుకుపోయిన ఫోటోలను అధికారులు విడుదల చేశారు. భారీ వర్షాలతో నదుల్లో ప్రవాహం ప్రమాదస్థాయిని మించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కొలంబియా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘కొండచరియలు విరిగిపడినప్పుడు చాలా పెద్ద శబ్దం మమ్మల్ని భయపెట్టింది.. మేము బయటకు వెళ్లి చూడగా ఇళ్లపై బండరాయి పడి ఉంది.. ఆ చోటుకు వెళ్లి చూడగా పలువురు లోపల చిక్కుకుని ఉన్నారు’’ అని స్థానిక ట్యాక్సీ డ్రైవర్ ఒకరు చెప్పారు. ఈ దుర్ఘటనపై కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, కొలంబియాలో కొండచరియలు విరిగిపడటం సాధారణంగా మారింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివాసం ఉండేవారికి వర్షాకాలంలో ముప్పు ఎక్కువగా ఉంటోంది. 2019లో నైరుతి కౌకా ప్రావిన్సుల్లో కొండచరియలు విరిగిపడి 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి రెండేళ్ల ముందు దక్షిణ పుటుమయో ప్రావిన్సుల్లోని మోకా పట్టణంపై రాకాసి మాదిరిగా బండరాళ్లు విరుచుకుపడి 250 మందిని బలితీసుకున్నాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/r79tcVo

Post a Comment

0 Comments