Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 16 February 2022

17కి చేరిన నిత్య పెళ్లికొడుకు బాధితుల జాబితా.. తెరపైకి మరో ముగ్గురు!

ఒడిశాలోని కేంద్రపర జిల్లాకు చెందిన రమేశ్ చంద్ర స్వైన్‌ (54) తాను డాక్టర్‌గా చెప్పుకుంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పంజాబ్‌, ఢిల్లీ, అసోం, ఝార్ఖండ్‌, ఒడిశాలకు చెందిన 14 మహిళలను తన వలలోకి దింపి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. తాజాగా, ఈ జాబితాలో మరో ముగ్గురు బాధితులు వచ్చి చేరారు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇతగాడి రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడటంతో పోలీసులే విస్తుపోతున్నారు. కేంద్ర వైద్యారోగ్య శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నట్టు మ్యాట్రిమోనియల్‌ సైట్స్‌ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకున్నట్టు తేలింది. ఉన్నత విద్యావంతులు, ప్రవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నవారిని వంచించి పెళ్లిళ్లు చేసుకోవడం గమనార్హం. వారి డబ్బు మీద ఉన్న ఆశతో ఇంతటి పనికి ఒడిగట్టినట్టు తేలింది. 14వ భార్య ఫిర్యాదుతో అతడి గుట్టురట్టయ్యింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, అసోంకి చెందిన ఫిజీషియన్ ఈ జాబితాలో ఉన్నారు. ఒడిశాలోని జగత్సింఘ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇతడి మాయలో పడి రూ.18 లక్షలు పోగొట్టుకుంది. మెడికల్ సీటు ఇప్పిస్తానని చెప్పి ఈ మొత్తాన్ని కాజేసినట్టు భువనేశ్వర్ డీసీపీ యూఎస్ దాస్ తెలిపారు. నిందితుడి ఆర్ధిక లావాదేవీలపై విచారణకు అతడి మొబైల్ ఫోన్‌ను విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు పేర్కొన్నారు. నిందితుడి వద్ద మూడు పాన్ కార్డులు, 11 ఏటీఎం కార్డులు గుర్తించినందున ఆర్బీఐ సాయం కూడా కోరామని అన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు భార్యల్లో నలుగురు ఒడిశాలోనూ, ఢిల్లీ, అసోంలో ముగ్గురు చొప్పున, మధ్యప్రదేశ్, పంజాబ్‌లో ఇద్దరేసి, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక్కొక్కరు ఉన్నారు. వీరి మోసపూరితంగా పెళ్లిచేసుకుని, లక్షల రూపాయాలతో ఉడాయించినట్టు గుర్తించారు. నిందితుడు అసలు పేరు కాగా.. బిభు ప్రకాశ్ స్వైన్, రమణి రంజన్ స్వైన్ పేర్లతో వీరందర్నీ బుట్టలో వేసుకున్నారు. పంజాబ్ మహిళను పెళ్లిచేసుకుని రూ.10 లక్షలు కొట్టేసిన నిందితుడు.. వివాహం జరిగిన గురుద్వారాలోని ఓ వ్యక్తి దగ్గర మెడికల్ సీటు ఇప్పిస్తానని చెప్పి రూ.11 లక్షలు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లయిన తర్వాత కొద్దిరోజులు వారి వద్దే ఉండి తరువాత ఏదైనా పని నిమిత్తం భువనేశ్వర్‌కు వెళతాననే నెపంతో మహిళలను తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లేవాడు. ఢిల్లీకి చెందిన ఓ టీచర్ పోలీసులకు గతేడాది జులైలో ఫిర్యాదు చేసింది. న్యూఢిల్లీలోని ఆర్యసమాజ్ ఆలయంలో స్వైన్ తనను పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు భువనేశ్వర్‌లోని ఖండగిరి ప్రాంతంలోని ఓ ఇంట్లో అతడ్ని సోమవారం అరెస్టు చేశారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/T7EaHmA

No comments:

Post a Comment