దేశంలో 25 వేల కిలోమీటర్ల కొత్త హైవే రోడ్ల నిర్మాణం

ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా దేశంలో 25 వేల కిలోమీటర్ల మేర కొత్తగా జాతీయ రహదారులని నిర్మించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లోక్‌సభలో ఆమె మంగళవారం 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి వివరాలు వెల్లడించారు. దేశంలో ఎక్స్‌ప్రెస్‌ వేలను ఈ ఏడాది పెంచనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రయాణికులను సౌకర్యార్థం, సరుకులను వేగంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేందుకు వీలుగా కొత్త రహదారులను నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో రోప్‌వే అభివృద్ధి ప్రణాళికను చేపట్టనున్నట్టు, ఈ ప్రాజెక్ట్ కోసం 20 వేల కోట్ల రూపాయలను సమకూర్చనున్నట్టు మంత్రి చెప్పారు. దీంతో రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. 2025 నాటికి దేశంలో రెండు లక్షల కిలోమీటర్ల జాతీయ ఉండాలనే ఉద్దేశంతో, ఎన్‌డీఏ ప్రభుత్వం రహదారులు, హైవే ప్రాజెక్టులపై దృష్టి సారించినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే 2022-23లో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను కూడా ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. కాగా సోమవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, దేశంలోనే అత్యంత పొడవైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/mcyl0JGOI

Post a Comment

0 Comments