కేరళలో కరోనా విలయం.. కొత్తగా 51 వేలకుపైగా కేసులు, 1205 మంది మృతి

కేరళలో కోవిడ్ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే 51,887 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క రోజులోనే కరోనాతో 1205 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. మృతుల సంఖ్య 55,600కి చేరాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60,77,556కు చేరింది. ఇందులో 56,53,376 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,67,847 ఉన్నాయి. రాష్ట్రంలో 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 9,331 కేసులు నమోదవగా, త్రిసూర్‌లో 7,306, తిరువనంతపురంలో 6,121, కోజికోడ్‌లో 4,234, కొల్లంలో 3,999, కొట్ట్యంలో 3,601, పాలక్కాడ్‌లో 3,049, అలప్పుజాలో 2,967, మలప్పురంలో 2,838, పతనంతిట్టలో 2,678, ఇడుక్కిలో 2,130, కన్నూర్లో 2,081 కేసులు నమోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,34,281 కేసులు నమోదయ్యాయి. అయితే కేసులు తగ్గుముఖం పట్టినా.. అయితే మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు అమలవుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ ఆంక్షలను సడలించాయి. పాఠశాలలు కూడా తెరుచుకున్నాయి. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ కర్ఫ్యూలను కూడా ఎత్తివేశాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం నిబంధనలు కొనసాగుతూనే ఉన్నాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/oekU7rdV3

Post a Comment

0 Comments