కేరళ సీఎం పినరయి విజయన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. సీఎం పినరయ్ విజయన్‌పై వాట్సాప్‌లో పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేరళ సచివాలయంలో పనిచేస్తున్న ఆఫీస్ అటెండెంట్‌ని విధుల నుంచి తొలగించారు. పినరయి విజయన్ ఇటీవల దుబాయ్‌లో పర్యటించారు. కేరళ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అక్కడి విదేశీ వాణిజ్య మంత్రిత్వశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యూఏఈ మంత్రులు, అధికారులతో కలిసి దిగిన ఫోటోను సీఎం పినరయ్ విజయన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. సీఎం విజయన్ సూట్ వేసుకుని ఉన్న ఆ ఫోటోను.. ఏ.మణికుట్టన్ అనే తన వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తూ “గూండాలు వేర్వేరు వేషధారణలో ఉన్నారు” అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ విషయాన్ని సచివాలయం అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ అంశాన్ని సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా మణికుట్టన్‌ను విధుల నుంచి తప్పించారు. కాగా మణికుట్టన్ కాంగ్రెస్‌కు చెందిన సచివాలయ ఉద్యోగుల సంఘంలో సభ్యుడిగా ఉండడంతో అతనిపై కక్షకట్టిన కొందరు ఈ చర్యకు పాల్పడ్డారనే వాదన వినిపిస్తుంది. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటన కేరళలో చోటుచేసుకుంది. సీఎం పినరయి విజయన్‌పై ఫేస్‌బుక్‌లో అవమానకరమైన వ్యాఖ్యను పోస్ట్ చేసినందుకు కార్పొరేషన్‌లోని కట్టకడ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.రాయ్‌ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేశారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు ఆలస్యంగా చెల్లించడంతో సీఎంను విమర్శిస్తూ రాయ్ పోస్ట్ పెట్టారు. ఆ కామెంట్ తీవ్ర దుమారాన్ని రేపింది. దాంతో ఆ ఉద్యోగిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/m23VFNW
0 Comments