ఆవుల కోసం కలెక్టర్ కారును అడ్డగించిన యాచకురాలు.. గోవులను ఇప్పించాలని వినతి

ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఓ వృద్ధురాలు ఆవుల కోసం కలెక్టర్ కారు ముందు పడుకుంది. తన ఆవులను ఇప్పించాలని అర్థించింది. అక్కడ తరాష్ బాగ్ అనే నిరుపేద వృద్ధురాలు భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో సోనేపూర్ జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఉంటుంది. రోజూ అడుక్కుని బతికే ఆమె తనకొచ్చిన డబ్బుల్లో తన ఖర్చులు పోగా నాలుగు ఆవులను పోషిస్తుంది. ప్రతిరోజూ వాటి ఆలనా పాలనా చూసుకోవడం అలవాటుగా మారింది. అయితే ఆ విచ్చలవిడిగా తిరుగుతూ రోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుండడంతో మున్సిపల్ అధికారులు వాటిని గోశాలకు తరలించారు. దీంతో ఆ ఆవుల కోసం తరాష్ బాగ్ మున్సిపల్ అధికారులను కలిసింది. ఆమె అభ్యర్థనను వారు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఆవులను తిరిగి పంపించలేదు. దాంతో తాను ఉండే దవాఖాన పక్కనే జిల్లా కలెక్టరేట్‌ ఉండడంతో తరాష్ బాగ్ అక్కడకు వెళ్లింది. విధుల్లో భాగంగా బయటకు వెళ్తున్న కలెక్టర్ కారుకు అడ్డంగా పడింది. తన ఆవులను అధికారులు తీసుకెళ్లిపోయారని, వాటిని ఇప్పించాలని కోరింది. ఆమె మాటలు విని, విషయం తెలుసుకున్న ఆ గోవులను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దాంతో అక్కడ నుంచి సంతోషంగా తరాష్ బాగ్ వెళ్లిపోయింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/Df2JanC

Post a Comment

0 Comments