Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 17 February 2022

కాల్పులతో దద్దరిల్లిన ఉక్రెయిన్ తూర్పు సరిహద్దులు.. కొట్టిపారేస్తున్న రష్యా!

యుద్ధాన్ని కోరుకోవడం లేదంటూనే ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దూకుడుగా ముందుకెళ్తోంది. ఓవైపు సైన్యాలను వెనక్కు మళ్లించామని చెబుతూనే.. మరోవైపు కాల్పులకు పాల్పడుతోంది. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలోని కాడివ్కాలో కాల్పులు చోటుచేసుకోవడంతో పశ్చిమ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. తూర్పు ప్రాంతంలో యుద్ధ ట్యాంకులు, ఫిరంగులతో కాల్పులకు పాల్పడినట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. రష్యా మద్దతున్న వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ సైనికుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటనలో ప్రాణనష్టం లేనప్పటికీ ఇద్దరు పౌరులకు గాయాలైనట్లు సమాచారం. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పట్ల ఇరు దేశాలూ ఒకరిపై ఒకటి ఆరోపణలు మొదలుపెట్టాయి. సరిహద్దు ప్రాంతంలో గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే కాల్పులకు పాల్పడినట్టు ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. మరోవైపు, ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపినట్లు వేర్పాటువాదులు ఆరోపించారు. గత 24 గంటల్లో నాలుగుసార్లు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైన్యం మోహరించిన తరుణంలో రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌ ఆక్రమణకు ఓ కారణాన్ని చూపి, ఆ ప్రాంతంలో మారణహోమం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన రష్యా.. సరిహద్దుల్లో మోహరించిన తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటున్నామని పేర్కొంది. ఇప్పటికే దాదాపు లక్షకుపైగా సైనిక సిబ్బందిని వెనక్కి రప్పించే పనిలో ఉన్నామని తెలిపింది. కానీ, రష్యా ప్రకటనలను అమెరికా మాత్రం నమ్మడం లేదు. వేల సంఖ్యలో అదనపు బలగాలను ఉక్రెయిన్ సరిహద్దుకు రష్యా తరలిస్తోందని ఆరోపించింది. అటు, చర్చలకు రష్యా ఆహ్వానాన్ని అగ్రరాజ్యం అమెరికా స్వాగతించింది. ఉక్రెయిన్‌పై దాడిచేయకుంటే రష్యా ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేనీ అన్నారు. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గయ్ లవరోవ్‌తో ఆయన వచ్చే వారం సమావేశమవుతారు. ‘ఈ సంక్షోభాన్ని పరిష్కారానికి బాధ్యతాయుతమైన మార్గం దౌత్యం, చర్చలు మాత్రమే అని మేం బలంగానమ్ముతున్నాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/a5phPJE

No comments:

Post a Comment